పుష్ప … చూపుల్తో చంపేశాడు

ఇది మ‌రో.. స్టైలీష్ స్టార్‌… న‌యా అవ‌తార్‌. అవును.. సినిమా సినిమాకీ లుక్కులు మార్చి, కొత్త స్టైల్స్ తో అభిమానుల్ని మైమ‌ర‌పించే స్టైలీష్ స్టార్‌, ఇప్పుడు మ‌రో కొత్త లుక్ లో ద‌ర్శ‌న మిచ్చాడు. `పుష్ప`గా స‌రికొత్త అవ‌తారం ఎత్తాడు. సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో బ‌న్నీ 20 వ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌, పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి `పుష్ప ` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో హీరో పేరు ఇది. త‌నో లారీ డ్రైవ‌ర్‌. ఆ లారీ పేరు కూడా `పుష్ప `నే. గుబురు గ‌డ్డంతో, ఎన‌భైల్లో క‌నిపించే హెయిర్ స్టైల్‌తో.. పుష్ప చూపుల‌తోనే చంపేస్తున్నాడు. బ‌హుశా.. త‌న కెరీర్‌లోనే ఇది మ‌హా మాస్ లుక్ అనుకోవచ్చు. నిజానికి రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్పుడో మొదలు కావ‌ల్సింది. అయితే… లాక్ డౌన్ వ‌ల్ల షూటింగ్ ఆగిపోయింది. బ‌న్నీ సెట్లోకి అడుగుపెట్టే తొలి రోజు పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌డంతో పాటు, టైటిల్ చెప్పేయాల‌ని భావించింది చిత్ర‌బృందం. పుట్టిన రోజుకి చిన్న టీజ‌ర్‌ని విడుద‌ల చేద్దామ‌నుకుంది. అయితే లాక్ డౌన్ వ‌ల్ల షూటింగ్ జ‌ర‌గ‌లేదు. దాంతో ఫ‌స్ట్ లుక్ తో స‌రిపెట్టుకోవాల్సివ‌చ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుతో దిల్ రాజు సినిమా?

టాలీవుడ్ లోని బ‌డా హీరోలంద‌రితోనూ సినిమాలు తీశాడు దిల్ రాజు. అయితే ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ‌ ల‌తో మాత్రం సినిమాలు రాలేదు. చిరంజీవితో సినిమా చేయాల‌ని గ‌త కొంత‌కాలంగా భావిస్తున్నాడు...

స్థానిక ఎన్నికలపై ఏపీ బీజేపీకి ఒపీనియన్ లేదా..!?

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీలో రాజకీయ అలజడి రేగడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనాకు ముందు స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఏపీ సర్కార్ ఎన్నికల నిర్వహణపై ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నాయో.. ఇప్పుడు...

‘లూసీఫ‌ర్‌’ సెకండాఫ్ రిపేర్లు

చిరంజీవి దృష్టిలో ప‌డిన మ‌రో రీమేక్‌.. 'లూసీఫ‌ర్‌'. మోహ‌న్ లాల్ హీరోగా చేసిన సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ బాధ్య‌త‌ల్ని చిరంజీవి వినాయ‌క్ చేతిలో పెట్టాడు. నిజానికి `లూసీఫ‌ర్‌` గొప్ప...

‘ఆహా’ కి క‌లిసొచ్చిన చిన్న సినిమాలు

ఈమ‌ధ్య మ‌ల‌యాళం డ‌బ్బింగుల్ని ఎక్కువ‌గా న‌మ్ముకొంది `ఆహా`. వ‌రుస‌గా మ‌ల‌యాళం డ‌బ్బింగులే వ‌స్తోంటే... `ఆహా`లో డబ్బింగులు మాత్ర‌మే వ‌స్తాయా? అంటూ సెటైర్లు కూడా వేసుకున్నారు సినీ అభిమానులు. కానీ చిన్న సినిమాల్ని కొనే...

HOT NEWS

[X] Close
[X] Close