ఈరోజుతో చిరుకి ఉన్న అనుబంధం ఇదే!

”ఏప్రిల్ 8వ తారీఖుతో నాకు బోలెడంత అనుబంధం ఉంది” అంటూ… రెండ్రోజుల క్రితం ట్వీట్ చేశారు చిరంజీవి. ఏప్రిల్ 8 అంటే బ‌న్నీ పుట్టిన రోజు. అందుకే చిరంజీవి ఆ ట్వీట్ చేశారేమో అనుకున్నారు ఫ్యాన్స్‌. ఏప్రిల్ 8తో చిరుకి ఉన్న మ‌రో ర‌క‌మైన అనుబంధం ఏమిటా? అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఆ స‌స్పెన్స్‌ని ఇప్పుడు చిరునే బ‌ద్ద‌లు కొట్టారు.

ఈరోజు హ‌నుమ‌జ్జ‌యంతి. చిరంజీవి ఆంజ‌నేయ స్వామి భక్తుడు. శివ శంక‌ర వ‌ర ప్ర‌సాద్ పేరుని చిరంజీవిగా మార్చుకోవ‌డం వెనుక‌.. ఉన్న క‌థ కూడా చిరంజీవి ఫ్యాన్స్‌కి తెలుసు. దానికి తోడు… ఓరోజు చిరంజీవికి లాట‌రీలో ఆంజ‌నేయ స్వామి బొమ్మ వ‌చ్చింద‌ట‌. ఆ బొమ్మ‌ని ఇప్ప‌టికీ త‌న ద‌గ్గ‌రే ప‌దిలంగా దాచుకున్నాడ‌ట చిరు. ఆ విష‌య‌మే చెబుతూ అప్ప‌ట్లో లాట‌రీలో వ‌చ్చిన ఆంజ‌నేయస్వామి బొమ్మ‌ని ట్విట్ట‌ర్ లో త‌న ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. అంతే కాదు.. ఆ బొమ్మ‌ని చూపిస్తూ… ‘క‌నుబొమ్మ‌లు, క‌ళ్లు ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి` అని మా నాన్న‌గారు చెప్పారు’ అంటూ అప్ప‌ట్లో త‌న ఫొటోని కూడా షేర్ చేసుకున్నారు.

మ‌రోవిశేషం ఏమిటంటే ఓసారి ప్ర‌ముఖ చిత్ర‌కారుడు బాపు చిరంజీవి కోసం ఆంజ‌నేయ‌స్వామి చిత్ర‌ప‌టం గీసి బ‌హుమ‌తిగా పంపార్ట‌. పంపుతూ ఓ మాట కూడా అన్నార్ట‌. ‘అదేంటోనండీ బొమ్మ‌ను గీస్తుంటే మీ పోలిక‌లే వ‌చ్చాయండీ. మార్చ‌లేదు. అలానే ఉంచేశాను’ అన్నార్ట‌. ఓ చిత్ర‌కారుడి నుంచి అలాంటి కాంప్లిమెంట్ రావ‌డం గొప్ప విష‌య‌మే. అందుకే ఆ బొమ్మ‌ని సైతం పాల రాతిపై రీ ప్రొడ్యూస్ చేయించి అలానే ఉంచేశార్ట‌. అందుకే ఈ రోజుతో చిరుకి అంత అనుబంధం. అన్న‌ట్టు ఈరోజు బ‌న్నీ పుట్టిన రోజు కూడా. ఇదే విష‌యాన్ని చెబుతూ బ‌న్నీతో త‌న చిన్న‌ప్ప‌టి ఫొటోని అభిమానుల‌తో పంచుకున్నారు. ‘డాన్స్ లో గ్రేస్ ఆ వ‌య‌సులోనే ఉంది. బ‌న్నీలో ఆ క‌సి, ఆ కృషి నాకిష్టం’ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. అదీ ఏప్రిల్ 8తో చిరుకి ఉన్న అనుబంధం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేగేదాకా లాగుతున్న సర్కార్-ఎస్‌ఈసీ..!

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగసంక్షోభ సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు కూడా స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం.. అధికారులు సహకరించడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. అదే సమయంలో ఎస్‌ఈసీ...

గ్రేటర్ పీఠం కైవసానికి టీఆర్ఎస్ స్కెచ్ రెడీ ..!

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవిని అలా వదిలేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దలకు మనస్కరించలేదు. ఎలాగోలా పీఠంపై గులాబీ నేతను కూర్చోబెట్టాల్సిందేనని డిసైడయ్యారు. ఎన్నికలు ముగిసి చాలా కాలం అవుతున్నా.. పాత కార్యవర్గానికి...

ధిక్కరణకే సర్కారు మొగ్గు..!

పంచాయతీ ఎన్నికల విషయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ.. ఎస్‌ఈసీకి సహకరించకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు అధికారులకు తేల్చి చెప్పడంతో వారెవరూ.. ఎస్‌ఈసీతో కనీసం సమావేశానికి కూడా ఆసక్తి చూపడంలేదు. పంచాయతీ...

వెంటిలేటర్‌పై శశికళ..!

ఇరవై ఏడో తేదీన చిన్నమ్మ విడుదలవుతుంది.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దున్ని పారేస్తుందని... తమిళ మీడియా జోరుగా విశ్లేషిస్తున్న సమయంలో అనూహ్యంగా శశికళ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు శ్వాస సమస్య...

HOT NEWS

[X] Close
[X] Close