ఉరిమి ఉరిమి టిక్ టాక్‌పై పడుతున్న నెటిజన్లు..!

కరోనా మహమ్మారిపై ప్రపంచం అంతా పోరాడుతోంది. ఎంత నష్టం జరుగుతోందో.. అంత అసహనం దేశాల్లో.. ప్రజల్లో కనిపిస్తోంది. అదంతా చైనా వైపు మళ్లుతోంది. కరోనా వైరస్ అక్కడే పుట్టిందనే బలమైన నమ్మకంతో పాటు… బయోవార్‌లో భాగంగా ఆ దేశమే సృష్టించిందనే ఆరోపణలు రావడం కూడా.. మరో కారణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఇది చైనీస్ వైరస్ అంటూ ప్రచారం చేసేస్తున్నారు. చైనా మీద చర్యలు తీసుకోవాలంటూ ఆస్ట్రేలియా ప్రధాని డబ్ల్యూహెచ్ఓను కోరారు. మరికొన్ని దేశాలు చైనాపై గుర్రుగా ఉన్నాయి. వీరితో పాటు సాధారణ ప్రజలు కూడా.. సోషల్ మీడియాలో చైనా యాప్‌లకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. వాటిని ఫోన్ల నుంచి తీసేయాలని ఉద్యమం ప్రారంభించారు.

కరోనా వైరస్ ఎఫెక్ట్ ముఖ్యంగా రెండు చైనా యాప్ ల మీద ప్రముఖంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టిక్‌టాక్, జూమ్ యాప్ మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ యాప్ ల బ్యాన్ కు సంబంధించి సోషల్ మీడియా వేదికగా భారీ చర్చే జరుగుతోంది. బ్యాన్ టిక్ టాక్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో జోరుగా నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. ఆ దేశ ప్రొడక్ట్స్ అన్నింటినీ బ్యాన్ చేద్దాం అంటూ ఇంకొందరు గళం విప్పుతున్నారు. ఒకే రోజు పదివేలకు పైగా హ్యాష్ ట్యాగ్ లు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తమ ఫోన్‌లో యాప్ డిలీట్ చేయడమే కాదు… ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యతేరికతను తగ్గించుకోవడానికో ఏమో కానీ.. టిక్ టాక్ మాత్రం ఇండియాకు వంద కోట్ల సాయం చేసింది. 100 కోట్ల విలువైన 4లక్షల మెడికల్ ప్రొటెక్టివ్ సూట్లు, 2లక్షల మాస్కులను భారత్‌లోని డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు అందించింది. చైనా ఉత్పత్తులు.. యాప్‌లు బహిష్కరించాలంటూ.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం… ఎంత మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ఎందుకంటే.. భారతీయుల చేతుల్లో ఉన్న ఫోన్లలో 90 శాతం.. చైనా తయారీవే ఉంటాయి. ప్రతీదానికి చైనాపై ఆధారపడటం ఎప్పటి నుండో ప్రారంభమయిది. దీన్ని అధిగమించి.. ఆ దేశం వస్తువులను ఇండియా బహిష్కరిస్తే.. గొప్ప పట్టుదలను ప్రదర్శించినట్లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకూ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకోకూడదట..!

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకున్నట్లుగా ప్రకటించుకుని.. సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం చట్ట విరుద్ధమని తాజాగా ఏపీ ప్రభుత్వం వాదన వినిపించడం ప్రారంభించింది. సోమవారం.. ఎస్‌ఈసీగా రమేష్...

అన్‌లాక్ 1 : 8వ తేదీ నుంచి హోటళ్లు, ఆలయాలు ఓపెన్..!

దేశంలో లాక్‌డౌన్‌ను కంటెన్మెంట్‌జోన్లకే పరిమితం చేస్తూ... కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్‌ ముగింపు కోసం.. అన్‌లాక్ పాలసీని ప్రకటించింది. దీనిలో భాగంగా జూన్ ఎనిమిదో తేదీ నుంచి ఆలయాలు, హోటళ్లు,...

ఇన్ సైడ్ న్యూస్: సొంత పత్రిక , ఛానల్ ప్రారంభించడం కోసం జనసేన కసరత్తు

త్వరలోనే సొంత పత్రిక, టీవి ఛానల్ ప్రారంభించాలనే యోచన తో జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీలో క్యాడర్ నుంచే కాకుండా, పార్టీ ముఖ్య నేతల...

మోడీ సాధించే స్వావలంబనపై పవన్‌కు ఎంతో నమ్మకం..!

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో దేశం స్వయం స్వావలంబన సాధిస్తుందని.. ప్రధానమంత్రి మోడీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తరవాత గట్టిగా నమ్ముతున్న వ్యక్తి జనసేన అధినేత పవన్...

HOT NEWS

[X] Close
[X] Close