‘ఐకాన్‌;… క‌థ ఇంకా ముగియ‌లేదా?

‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ త‌ర‌వాత అల్లు అర్జున్ `ఐకాన్‌` చేయాల్సింది. వేణు శ్రీ‌రామ్ చెప్పిన ఈ క‌థ బ‌న్నీకి బాగా న‌చ్చింది. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ లో రూపొందించాల‌నుకున్నారు. కొంత వ‌ర్క్ కూడా చేశారు. ఎందుక‌నో.. దాన్ని ప‌క్క‌న పెట్టేశారు. ఆ త‌ర‌వాత ‘అల వైకుంఠ‌పుర‌ములో’ మొద‌లైంది. అది సూప‌ర్ హిట్ట‌వ్వ‌డం, ఆ వెంట‌నే సుకుమార్ సినిమా ప‌ట్టాలెక్కేయ‌డంతో `ఐకాన్‌`ని మ‌ర్చిపోయారంతా.

అయితే దిల్ రాజు టీమ్ మాత్రం ‘ఐకాన్‌’ సినిమాని మ‌ళ్లీ గుర్తు చేసింది. ఈ రోజు బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా ‘ఐకాన్‌’ టీమ్ బ‌ర్త్‌డే విషెష్ చెబుతూ ఓ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది. పోస్ట‌ర్ పాత‌దే. కాక‌పోతే… ఈ సినిమాపై కొత్త ఆశ‌లు చిగురించ‌డం మొద‌లెట్టాయి. ఈ సినిమా ప‌క్క‌న పెట్టేలేద‌ని, బ‌న్నీతో తీస్తామ‌న్న సంకేతాల్ని పంపింది చిత్ర‌బృందం. నిజానికి ఈ కథ‌పై ఇప్ప‌టికీ బ‌న్నీకి మ‌మ‌కారం పోలేదు. కాక‌పోతే ఇదో ప్ర‌యోగాత్మ‌క క‌థ‌. క‌మ‌ర్షియ‌ల్ గా ఎంత వ‌ర్క‌వుట్ అవుతుందో అన్న అనుమానం ఉంది. అందుకే బ‌న్నీ కాస్త జంకుతున్నాడు. ఇప్పుడు కాక‌పోయినా, రాబోయే రోజుల్లో అయినా త‌న క‌థ‌లో బ‌న్నీని చూసుకోవ‌చ్చ‌ని వేణు శ్రీ‌రామ్ న‌మ్మ‌కంగా ఎదురు చూస్తున్నాడు. ప్ర‌స్తుతం వేణు శ్రీ‌రామ్ `పింక్ `రీమేక్ తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా హిట్ట‌యితే, వేణుపై న‌మ్మ‌కం కుద‌రొచ్చు. ఐకాన్ ప‌ట్టాలూ ఎక్క‌వ‌చ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకూ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకోకూడదట..!

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకున్నట్లుగా ప్రకటించుకుని.. సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం చట్ట విరుద్ధమని తాజాగా ఏపీ ప్రభుత్వం వాదన వినిపించడం ప్రారంభించింది. సోమవారం.. ఎస్‌ఈసీగా రమేష్...

అన్‌లాక్ 1 : 8వ తేదీ నుంచి హోటళ్లు, ఆలయాలు ఓపెన్..!

దేశంలో లాక్‌డౌన్‌ను కంటెన్మెంట్‌జోన్లకే పరిమితం చేస్తూ... కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్‌ ముగింపు కోసం.. అన్‌లాక్ పాలసీని ప్రకటించింది. దీనిలో భాగంగా జూన్ ఎనిమిదో తేదీ నుంచి ఆలయాలు, హోటళ్లు,...

ఇన్ సైడ్ న్యూస్: సొంత పత్రిక , ఛానల్ ప్రారంభించడం కోసం జనసేన కసరత్తు

త్వరలోనే సొంత పత్రిక, టీవి ఛానల్ ప్రారంభించాలనే యోచన తో జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీలో క్యాడర్ నుంచే కాకుండా, పార్టీ ముఖ్య నేతల...

మోడీ సాధించే స్వావలంబనపై పవన్‌కు ఎంతో నమ్మకం..!

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో దేశం స్వయం స్వావలంబన సాధిస్తుందని.. ప్రధానమంత్రి మోడీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తరవాత గట్టిగా నమ్ముతున్న వ్యక్తి జనసేన అధినేత పవన్...

HOT NEWS

[X] Close
[X] Close