పోలీస్ స్టేష‌న్ లో ‘పుష్ప’

ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సుకుమార్ సినిమా టైటిల్‌నీ, ఫ‌స్ట్ లుక్‌నీ బ‌య‌ట పెట్టారు. ర‌ఫ్ లుక్‌తో బ‌న్నీ అద‌ర‌గొట్టేశాడు. అయితే ఇప్పుడు మ‌రో పోస్ట‌ర్‌నీ చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. పోలీస్ స్టేష‌న్‌లో, ఎర్ర చంద‌నం దిమ్మ‌ల ప‌క్క‌న‌, గొడ్డ‌లితో బ‌న్నీ కూర్చున్న షాట్ అది. ఎర్ర చందనం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ క‌థ న‌డుస్తుంద‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. దాన్ని ప్ర‌తిబింబించేలా ఈ పోస్ట‌ర్‌ని డిజైన్ చేశాడు సుకుమార్‌. టైటిల్ లోగోలో కొన్ని వేలి ముద్ర‌ల గురుతులు క‌నిపిస్తున్నాయి. దానికీ.. ఈ క‌థ‌కీ ఏదో సంబంధం ఉండే ఉంటుంది. సుకుమార్ క‌థ‌ల‌న్నీ ఎక్క‌డో ఓ చోట లాజిక్‌తో ముడిప‌డి ఉంటాయి. ఈ క‌థ‌లోనూ అలాంటి ట్విస్టు, లాజిక్కూ ఏదో ఒక‌టి ఉండే ఉంటుంది. అందుకే సింబాలిక్ గా టైటిల్ ని అలా డిజైన్ చేసి ఉంటారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుతో దిల్ రాజు సినిమా?

టాలీవుడ్ లోని బ‌డా హీరోలంద‌రితోనూ సినిమాలు తీశాడు దిల్ రాజు. అయితే ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ‌ ల‌తో మాత్రం సినిమాలు రాలేదు. చిరంజీవితో సినిమా చేయాల‌ని గ‌త కొంత‌కాలంగా భావిస్తున్నాడు...

స్థానిక ఎన్నికలపై ఏపీ బీజేపీకి ఒపీనియన్ లేదా..!?

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీలో రాజకీయ అలజడి రేగడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనాకు ముందు స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఏపీ సర్కార్ ఎన్నికల నిర్వహణపై ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నాయో.. ఇప్పుడు...

‘లూసీఫ‌ర్‌’ సెకండాఫ్ రిపేర్లు

చిరంజీవి దృష్టిలో ప‌డిన మ‌రో రీమేక్‌.. 'లూసీఫ‌ర్‌'. మోహ‌న్ లాల్ హీరోగా చేసిన సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ బాధ్య‌త‌ల్ని చిరంజీవి వినాయ‌క్ చేతిలో పెట్టాడు. నిజానికి `లూసీఫ‌ర్‌` గొప్ప...

‘ఆహా’ కి క‌లిసొచ్చిన చిన్న సినిమాలు

ఈమ‌ధ్య మ‌ల‌యాళం డ‌బ్బింగుల్ని ఎక్కువ‌గా న‌మ్ముకొంది `ఆహా`. వ‌రుస‌గా మ‌ల‌యాళం డ‌బ్బింగులే వ‌స్తోంటే... `ఆహా`లో డబ్బింగులు మాత్ర‌మే వ‌స్తాయా? అంటూ సెటైర్లు కూడా వేసుకున్నారు సినీ అభిమానులు. కానీ చిన్న సినిమాల్ని కొనే...

HOT NEWS

[X] Close
[X] Close