కబడ్డీని ప్రచారం చేయబోతున్న అల్లు అర్జున్

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలోకి మరో ప్రచార కాంట్రాక్ట్ వచ్చిచేరింది. తెలుగు రాష్ట్రాలలో ‘ప్రో కబడ్డీ’ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్‌ను స్టార్ గ్రూప్ నియమించుకుంది. ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్టార్ గ్రూప్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, కబడ్డీ సిసలైన భారతీయ క్రీడ అని అన్నారు. ప్రో కబడ్డీ పుణ్యమా అని ఆ ఆటకు మళ్ళీ ఆదరణ లభిస్తోందని చెప్పారు. ఈ ఆటకు తాను బ్రాండ్ అంబాసిడర్ అయినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. వీలైతే తానుకూడా ఒక జట్టును కొనుగోలు చేస్తానని చెప్పారు. స్పోర్ట్స్ కథాంశంతో ఒక సినిమా చేయాలనుందనికూడా అర్జున్ తెలిపారు.

క్రికెట్‌కు ఐపీఎల్ తరహాలోనే కబడ్డీకి ప్రో కబడ్డీ పేరుతో లీగ్‌ను స్టార్ గ్రూప్ ప్రారంభించింది. దీనికి లే పంగా అంటూ అమితాబ్ బచ్చన్ ప్రచార గీతాన్ని పాడటం, అభిషేక్ బచ్చన్ ఒక జట్టు(జైపూర్ పింక్ పాంథర్స్)ను కొనుగోలు చేయటంతో క్రేజ్ గణనీయంగా పెరిగింది. 2014లో జరిగిన మొదటి సీజన్‌లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. రెండో సీజన్‌లో ‘తెలుగు టైటాన్స్’ పేరుతో తెలుగు జట్టుకూడా బరిలో దిగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close