ఒక హీరోతో అనుకున్న ప్రాజెక్ట్ కాస్తా చివరి నిమిషంలో వేరే హీరో చేతికి వెళ్ళిపోవడం మన సినిమా ఇండస్ట్రీలో వెరీ కామన్. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్ చేయాల్సిన రెండు ప్రాజెక్టులను తను తీసుకెళ్ళిపోయాడు. అలాగే హరీష్ శంకర్‌తో బన్నీ చేస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా కూడా అదుర్స్ సీక్వెల్లా ఉంటుంది అని చెప్తున్నారు. అదుర్స్ సినిమాలోని చారి క్యారెక్టర్ని స్ఫూర్తిగా తీసుకుని కొత్త కథను తయారు చేసుకున్నాడట హరీష్ శంకర్. ఆ కథను ముందుగా ఎన్టీఆర్కే చెప్పాడట. అయితే రామయ్యా వస్తావయ్యా సినిమా ఫలితం దెబ్బకో, లేక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయేమో తెలియదు కానీ ఎన్టీఆర్ మాత్రం హరీష్‌కి నో చెప్పాడట. అలా చూస్తే ఎన్టీఆర్ చేయాల్సిన మూడు ప్రాజెక్టులు ఇప్పుడు బన్నీ చేతిలోకి వెళ్ళిపోయినట్టు లెక్క.
ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ ఫుల్ స్వింగులో ఉన్నట్టుగా కనిపిస్తోంది కానీ ఎన్టీఆర్, బన్నీలలో ఎవరి డెసిషన్ కరెక్టో చెప్పాలంటే మాత్రం ఆ మూడు సినిమాలూ రిలీజ్ అయ్యేవరకూ వెయిట్ చెయ్యాల్సిందే. లింగుస్వామి ప్రాజెక్ట్‌తో తమిళ్లో కూడా తనకు భారీగా మార్కెట్ ఏర్పడుతుందని భావిస్తున్నాడు బన్నీ. ఇక హరీష్, వక్కంతం వంశీ సినిమాలతో సక్సెస్‌లు కొట్టాలనుకుంటున్నాడు. వక్కంతం సినిమాతో నాగబాబును నిర్మాతగా నిలబెట్టాలన్న ప్రయత్నాలు జరుతున్నట్టున్నాయి. ఈ సినిమాల రిజల్ట్స్ అన్నీ కూడా అల్లు వారి అబ్బాయి ఊహించినట్టుగా ఉంటే బన్నీ హీరోయిజం పీక్స్‌కి వెళ్ళిపోవడం ఖాయం. తేడా కొడితే మాత్రం ఎన్టీఆర్ స్థాయి జడ్జ్మెంట్ స్కిల్స్ కూడా బన్నీకి లేవు అన్న విమర్శలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఈ స్టైలిష్ స్టార్. రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.