వర్థమాన హీరోకు అల్లు అర్జున్ అభినందనలు

Allu Arjun
Allu Arjun

హైదరాబాద్: వర్ధమాన హీరో, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేమ్ సందీప్ కిషన్‌ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభినందించారు. సందీప్ తాజా చిత్రం టైగర్ చిత్రం విజయం సాధించినందుకుగానూ బన్ని ఈ అభినందనలు తెలిపారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ విజయంతర్వాత ఆ స్థాయి విజయం సాధించలేకపోయిన సందీప్, టైగర్ ద్వారా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ను దాటేశాడని బన్ని అన్నారు. ఈ అభినందనలతో సందీప్ ధ్రిల్ అయిపోతున్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత బన్నీ అన్న దగ్గరనుంచి మళ్ళీ టైగర్‌ చిత్రానికే ఫోన్ వచ్చిందని చెప్పాడు. సినిమా చాలా నచ్చిందని బన్నీ చెప్పినట్లు తెలిపాడు. ఈ ఫోన్ కాల్ తనకెంతో ఎనర్జీనిచ్చిందని అన్నాడు.

గతనెల 26న విడుదలైన టైగర్ చిత్రంలో సందీప్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ప్రధాన పాత్రధారులు. సందీప్ తొలి విజయం అందుకున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రానికి, ఈ టైగర్ చిత్రానికి కెమేరా మేన్ అతని మేనమామ ఛోటా కే నాయుడే కావటం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com