కేసీఆర్‌పై నిప్పులుచెరిగిన రేవంత్: భారీఊరేగింపుతో విడుదల

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడు, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఈ సాయంత్రం చర్లపల్లి జైలునుంచి విడుదలయ్యారు. బయటకొచ్చిన రేవంత్‌కు తెలుగుదేశం కార్యకర్తలు, అతని అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణనుంచేకాక ఆంధ్రప్రదేశ్‌నుంచికూడా తెలుగుదేశం కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చారు. భారీ ఊరేగింపుతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు బయలుదేరిన ర్యాలీ మధ్యలో – రేవంత్ అక్కడక్కడా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ తనపై కుట్రపన్ని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగాన్నంతా ఈ కేసుకోసం ఉపయోగించారని అన్నారు. తెలుగుదేశాన్ని లేకుండా చేస్తానన్న వ్యక్తికి పావురాలగుట్టలో ఎలాంటి గతి పట్టిందో కేసీఆర్‌కూ అదే గతి పడుతుందంటూ అన్యాపదేశంగా వైఎస్‌ను ఉటంకించారు. కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, హరీష్‌రావును, తలసాని శ్రీనివాస యాదవ్‌ను సన్నాసి, బద్మాష్‌వంటి తీవ్ర పదజాలంతో విమర్శించారు. కేసీఆర్ కుటంబంనుంచి తెలంగాణకు విముక్తి కల్పించటమే తన ఏకైక లక్ష్యమని చెప్పారు.

రేవంత్‌కు నిన్ననే హైకోర్ట్ బెయిల్ ఇచ్చినప్పటికీ, సాంకేతిక సమస్యల కారణంగా నిన్న విడుదల వీలుకాలేదు. ఇవాళ మధ్యాహ్నానికే బెయిల్ వారెంట్ రేవంత్ న్యాయవాదులకు అందింది. సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో రేవంత్ బయటకొచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ ప్రజలకు తీపి కబురు: కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు త్వరలో ఓ తీపి కబురు చెబుతానని ప్రకటించారు. ఈ మాట ఆయన మామూలుగా చెప్పలేదు. దానికో విశేషణం జోడించారు. అదేమిటంటే.. తాను చెప్పబోయే తీపి కబురు...

బాల‌య్య ఇష్యూ: కేసీఆర్‌పై నెట్టేశారుగా!

`ఇండ్ర‌స్ట్రీ స‌మావేశాల‌కు న‌న్ను పిల‌వ‌లేదు` అన్న బాల‌య్య మాట - ప‌రిశ్ర‌మ‌లో కొత్త వివాదానికీ, కాంపౌండ్ రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువు అయ్యింది. బాల‌య్య‌ని పిల‌వ‌క‌పోవ‌డం త‌ప్పే అని ప‌రిశ్ర‌మ‌లో చాలామంది పెద్ద‌లు తేల్చేస్తున్నారు....

ద‌ర్శ‌కేంద్రుడి ‘కాన్సెప్ట్’ ఏమిటి?

న‌మోః వేంక‌టేశాయ త‌ర‌వాత మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌లేదు ద‌ర్శ‌కేంద్రుడు. ఆయ‌న సినిమాల‌కు దూరంగానే ఉంటూ వ‌చ్చారు. ద‌ర్శ‌కేంద్రుడు రిటైర్ అయిపోయార‌ని, ఆయ‌న ఇక సినిమాలు చేయ‌ర‌ని వార్త‌లొచ్చాయి. కానీ ఓ మంచి సినిమా...

హైకోర్టుపై నిందలు… కొమ్మినేనికీ నోటీసులు..!

ఉన్నత న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి టీవీ ప్రధాన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సహా 44 మందికి హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై... అసభ్య పోస్టులను...

HOT NEWS

[X] Close
[X] Close