‘ఐకాన్‌’… విషాదాంత‌మా?

అల్లు అర్జున్ సినిమా పేరు… ‘ఐకాన్‌’ అన‌గానే – ఇదేదో ప్ర‌యోగాత్మ‌క చిత్ర‌మేమో అనుకున్నారంతా. టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసేయ‌డంతో – ‘ఐకాన్‌’ క‌థ ఇదంటూ పాయింటు లీక్ చేసేశారు కూడా. ఇదో పిలిపిన్ క‌థ అని, తెలుగు నేటివిటీకి, ఇక్క‌డి సెన్సిబులిటీస్‌కి త‌గిన‌ట్టుగా మార్పులూ, చేర్పులూ చేశార‌ని చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు తెలిసిన విష‌యం ఏమిటంటే.. ‘ఐకాన్‌’ చిత్రం విషాదాంతంగా ముగియ‌నున్న‌ద‌ట‌. క్లైమాక్స్‌లో అదే ట్విస్ట‌ని- అప్ప‌టి వ‌ర‌కూ ఓ క్యూట్‌ ల‌వ్ స్టోరీగా, స‌ర‌దా రోడ్ జ‌ర్నీగా సాగిన ‘ఐకాన్‌’ స‌డ‌న్‌గా విషాదంతమైపోతుంద‌ని తెలుస్తోంది. నిజానికి నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఈ క్లైమాక్స్ విష‌యంలో చిత్ర‌బృందం త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డింది. విషాదాంతాలు తెలుగు ప్రేక్ష‌కులు స్వీక‌రించ‌గ‌ల‌రా? లేదా? అని మ‌ల్ల‌గుల్లాలు ప‌డ్డారు. ‘జెర్సీ’ రిజ‌ల్ట్ ఈ చిత్ర‌బృందానికి కావ‌ల్సినంత బూస్ట‌ప్ ఇచ్చింది. జెర్సీ కూడా విషాదాంత‌మే. కానీ… దాన్ని ఓ హ్యూమ‌న్ ఎమోష‌న‌ల్ కోణంలో ముగించాడు. సేమ్ టూ సేమ్ అదే కోణంలో ‘ఐకాన్‌’ని ముగిస్తార‌ని, ఓ ఫీల్ గుడ్ ఎమోష‌న్ డ్రామాగా ‘ఐకాన్‌’ మిగ‌ల‌బోతోంద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close