ఫొటోగ్రాఫ‌ర్‌గా రాజ్‌త‌రుణ్‌..?

’96’ రీమేక్‌లో శ‌ర్వానంద్ ఫొటో గ్రాఫ‌ర్‌గా న‌టిస్తున్నాడు. త‌మిళ మాతృక‌లో హీరో ఫొటోగ్రాఫ‌రే కాబ‌ట్టి – శ‌ర్వాకి మ‌రో ఛాయిస్ లేకుండా పోయింది. ఇప్పుడు రాజ్ త‌రుణ్ కూడా కెమెరా ప‌ట్టుకుని క్లిక్ క్లిక్ మ‌నిపించ‌బోతున్నాడు. రాజ్ త‌రుణ్ కథానాయ‌కుడిగా ‘ఇద్ద‌రి లోకం ఒక‌టే’ సోమ‌వార‌మే ప‌ట్టాలెక్కింది. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంతో కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమాలో రాజ్ త‌రుణ్ ఫొటోగ్రాఫ‌ర్‌గా న‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం.

హీరోకి ఏదో ఓ ప్రొఫెష‌న్ ఉండాలి కాబట్టి, ఫొటో గ్రాఫ‌ర్ చేయ‌లేదు. దానికీ ఓకార‌ణం ఉంద‌ట‌. చిన్న‌ప్పుడు విడిపోయిన హీరో హీరోయిన్లు మ‌ళ్లీ క‌లుసుకోవ‌డానికి ఓ ఫొటో కార‌ణం అవుతుంది. ఆ ఫొటో తీసేది.. హీరోనే. అలా.. క‌థ‌కు, ఫొటోగ్ర‌ఫీకీ ఓ లింకు ఉంద‌న్న‌మాట‌. క‌థానాయిక పాత్ర‌కి చాలా ప్రాధాన్యం ఉందీ సినిమాలో. అందుకే… ఓ మంచి హీరోయిన్‌ని వెదికిప‌ట్టుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు దిల్‌రాజు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com