బుచ్చిబాబుకి లైన్ క్లియ‌ర్ చేసిన బ‌న్నీ

ఉప్పెన‌తో ఓ సూప‌ర్ డూప‌ర్ హిట్టు అందుకున్నాడు బుచ్చిబాబు. ఆ వెంట‌నే ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ వ‌చ్చింది. ఎన్టీఆర్ – బుచ్చిబాబు కాంబినేష‌న్ ప‌క్కా. కాక‌పోతే… ఎన్టీఆర్ కి ఉన్న వ‌రుస క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల బుచ్చిబాబు సినిమా ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. ఆర్‌.ఆర్‌.ఆర్ అయిపోయాక‌.. కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేయాలి ఎన్టీఆర్‌. ఆ త‌ర‌వాత అట్లీ లైన్‌లో ఉన్నాడు. ఆ త‌ర‌వాతే… బుచ్చి సినిమా ఉంటుంది.

అయితే ఇప్పుడు అట్లీ సినిమా వెన‌క్కి వెళ్లిపోయింది. అట్లీ ఎన్టీఆర్ తో పాటుగా బన్నీకి కూడా ఓ క‌థ చెప్పి ఉంచాడు. బ‌న్నీ, ఎన్టీఆర్‌ల‌లో ఎవ‌రు ముందుగా త‌న సినిమా ఓకే చేస్తే వాళ్ల‌తో క‌మిట్ అయిపోదామ‌నుకున్నాడు. ఇప్పుడు బ‌న్నీ ముందుకొచ్చి… అట్లీ క‌థ‌కి ఓకే చెప్పేశాడు. సో.. అట్లీ.. బ‌న్నీ ప్రాజెక్టుతో బిజీ అయిపోతాడు. కాబట్టి… ఇక్క‌డ బుచ్చిబాబుకి లైన్ క్లియ‌ర్ అయ్యింది. కొర‌టాల శివ‌తో సినిమా అవ్వ‌గానే.. బుచ్చి బాబు క‌థే ప‌ట్టాలెక్కే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కోసం బుచ్చి ఓ స్పోర్ట్స్ డ్రామాని సిద్ధం చేశాడు. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేయాల‌న్న‌ది ప్లాన్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రంగీలాలో చిరు – ర‌జ‌నీ – శ్రీ‌దేవి..?

రంగీలా... రాంగోపాల్ వ‌ర్మ త‌డాఖాని బాలీవుడ్ కి రుచి చూపించిన సినిమా. ఊర్మిళ‌ని ఈ సినిమా సూప‌ర్ స్టార్ ని చేసింది. నిజానికి.. ఈ క‌థ చిరంజీవి, ర‌జ‌నీ కాంత్, శ్రీ‌దేవిల‌తో చేయాల్సింద‌ట‌....

‘స‌లార్’ రిలీజ్ డేట్ .. పెద్ద ప్లానే ఉంది!

పాన్ ఇండియా ప్రాజెక్టు స‌లార్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఇది.. `రెబ‌ల్` రిలీజ్ డేట్. దాంతో ప్ర‌భాస్ అభిమానులు కంగారు ప‌డుతున్నారు.కాక‌పోతే... ఈ...

ఆ ఇద్ద‌ర్నీ గీతా ఆర్ట్స్ భ‌లే ప‌ట్టేసింది

సినిమా విడుద‌ల అయ్యాక, రిజ‌ల్ట్ ని బ‌ట్టి ద‌ర్శ‌కుడి చేతిలో అడ్వాన్సులు పెట్ట‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన సంగ‌తే. ఏ సినిమా హిట్ట‌వుతుందా? అని నిర్మాత‌లు ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. అయితే.. విడుద‌ల‌కు...

‘బింబిసార 2’లో… దిల్ రాజు హ్యాండ్‌

ఎవ‌రూ ఊహించ‌లేనంత పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది బింబిసార‌. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అంద‌రి దృష్టీ పార్ట్ 2పై ఉంది. బింబిసార విజ‌యంతో.. పార్ట్ 2పై న‌మ్మ‌కాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close