సైలెంట్ గా వ‌ర్క్ స్టార్ట్ చేసేసిన మారుతి

ప్ర‌భాస్ తో మారుతి సినిమా అనే వార్త‌… టాలీవుడ్ లో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమా టైటిల్‌, సంగీత ద‌ర్శ‌కుడు, నిర్మాత పేర్లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. మారుతి కూడా సోష‌ల్ మీడియాలో ఈ ప్రాజెక్టుపై స్పందించారు. `ఇవ‌న్నీ ఊహాగానాలే. అన్నీ స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చెబుతా` అన్నారు. కాక‌పోతే.. సైలెంట్‌గా త‌న ప‌ని తాను మొద‌లెట్టేశారు. మారుతి త‌న స‌హాయ ద‌ర్శ‌కులు, స‌హ ర‌చ‌యితల‌తో క‌లిసి… ప్ర‌భాస్ కోసం క‌థ రెడీ చేయ‌డంలో ప‌డిపోయారు. ఇప్ప‌టికే స‌గం క‌థ పూర్త‌య్యింద‌ని టాక్‌. వారం ప‌ది రోజుల్లో ఓ వెర్ష‌న్ రెడీ చేసి, ప్ర‌భాస్ కి వినిపించాలి. ఆ త‌ర‌వాతే… ఈ క‌థ ని ప్ర‌భాస్ ఓకే చేస్తే.. కాంబోకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంది. లేదంటే మ‌రో క‌థ వండే ప‌నిలో ప‌డ‌తారు మారుతి. ప్ర‌భాస్ తో ఓకే అనిపించుకున్న త‌ర‌వాత అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వాల‌న్న‌ది మారుతి ఆలోచ‌న‌.

స్వ‌త‌హాగా మారుతి మంచి ర‌చ‌యిత. త‌న క‌థ‌లన్నీ ఒక్క‌డే రాసుకుంటాడు. స‌హ ర‌చ‌యిత‌లు కూడా ఉండ‌రు.కానీ ఇది ప్ర‌భాస్ సినిమా కాబ‌ట్టి.. త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు టాక్‌. తొలిసారి… ఇద్ద‌రు ముగ్గురు రైట‌ర్ల‌తో క‌లిసి వ‌ర్క్ మొద‌లెట్టారు. హైద‌రాబాద్ లోని ఓ స్టార్ హోటెల్ లో.. స్క్రిప్టు వండ‌డం మొద‌లైంది. ఇదో హార‌ర్ జోన‌ర్ అని బ‌య‌ట టాక్ న‌డుస్తోంది. కానీ ఇదో ఫ్యామిలీ డ్రామా. స‌ర‌దా స‌ర‌దాగా మారుతి స్టైల్ లో సాగిపోయే క‌థ‌. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటార‌ని స‌మాచారం. ఈ సినిమాకి దాన‌య్య‌తో పాటుగా, నిరంజ‌న్ రెడ్డి నిర్మాత అని బ‌య‌ట ప్రచారం జ‌రుగుతోంది. కానీ.. ఈ సినిమాకి దాన‌య్య‌నే సోలో నిర్మాత‌. ఆయ‌నే ప్ర‌భాస్‌ని ఏక మొత్తంగా అడ్వాన్స్ ఇచ్చాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా పార్టీ నేతలపై దాడులు చేసుకుంటామా ?: సజ్జల

అమలాపురం దాడుల వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందన్న తీవ్ర ఆరోపణలు వస్తూండటంతో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. విపక్షాల విమర్శలు చూస్తుంటే... నవ్వొస్తుంది... అధికార పార్టీ నేతలప ఇళ్లపై...

మళ్లీ జగన్‌ను దారుణంగా అవమానించిన టీఆర్ఎస్ మంత్రి !

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయి... తమ మధ్య మంచి ర్యాపో ఉందని నిరూపిస్తూంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్...
video

”థ్యాంక్ యూ” టీజర్.. చైతు ప్రయాణం

https://www.youtube.com/watch?v=t5NPiPtZ8PY నాగచైతన్య- విక్రమ్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం థ్యాంక్ యూ. ఈ సినిమా టీజర్ బయటికి వచ్చింది. 'నా విజయానికి నేనొక్కడినే కారణం' అనే హీరో డైలాగ్ తో ఓపెన్ అయన టీజర్...

కోనసీమ చిచ్చుపై పవన్ ప్రశ్నలకు వైసీపీ దగ్గర జవాబుందా?

కోనసీమలో చిచ్చు పెట్టాడనికే వైసీపీ ప్రణాళికాబద్దంగా వ్యవహరించిందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇలా గొడవలు జరగడం.. అలా తమపై విమర్శలపై వైసీపీ నేతలు విరుచుకుపడటంతో పవన్ కల్యాణ్ అసలు విషయాలను ప్రజల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close