అల్లు అర్జున్ ‘పుష్ప 2’ విజయంతో పాటు ఒక విషాదాన్ని మిగిల్చింది. రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా బాధిత కుటుంబానికి అందుతున్న సహాయంపై తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్రాజు కీలక సమాచారం ఇచ్చారు.
అల్లు అర్జున్, భాస్కర్ కుటుంబం భవిష్యత్తు కోసం 2 కోట్లు డిపాజిట్ చేశారు. దానిపై వచ్చే వడ్డీ ద్వారా నెలకు రూ.75,000 కుటుంబ ఖర్చులకు, శ్రీతేజ్ వైద్య బిల్లులకు వినియోగిస్తున్నారు. అలాగే, అల్లు అర్జున్, అల్లు అరవింద్ కలిసి ఇప్పటి వరకు ₹75 లక్షలు ఆస్పత్రి ఖర్చుల కోసం చెల్లించారు.
కాకపోతే ఈ సహకారం సరిపోవడం లేదు. అదనపు సహకారం కావాలని బాబు తండ్రి భాస్కర్ కోరుతున్నారు. ఈ విషయాన్ని బన్నీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు దిల్ రాజు. అవసరమైతే శ్రీతేజ్కు మరొక సంవత్సరం రిహాబిలిటేషన్ సదుపాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని, బన్నీతో మాట్లాడి ఓకే చేసినట్లు కూడా చెప్పారు దిల్ రాజు.
నిజానికి చాలా దురదృష్టకరమైన ఘటన ఇది. ఇలాంటి తొక్కిసలాటని బన్నీ ఊహించలేదు. ఈ ఘటన తర్వాత అన్నిరకాలుగా బాధిత కుటుంబానికి అందుబాటులో వున్నారు. బాబు పూర్తిగా కోల్పోవడానికి ఎంత ఖర్చయిన పెట్టడానికి సిద్ధంగా వున్నారు.