బ‌న్నీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ల‌తో టేకాఫ్‌

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెరకెక్క‌నుంది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. `అల వైకుంఠ‌పుర‌ములో` విడుద‌లైన త‌ర‌వాతే బ‌న్నీ ఈ సినిమాకి కాల్షీట్లు ఇస్తాడు. అయితే అంత‌కు ముందే షూటింగ్‌కి వెళ్లాల‌ని సుక్కు భావిస్తున్నాడు. బ‌న్నీ లేకుండా కొన్ని ఎపిసోడ్స్ ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగా హీరో చిన్న‌ప్ప‌టి ఎపిసోడ్స్ ని ముందు పూర్తి చేయాల‌నుకుంటున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నాడు. సుక్కు – దేవిది సూప‌ర్ హిట్ కాంబో. మ‌రోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జ‌రుగుతున్నాయి. బన్నీ కోసం దేవిశ్రీ ఓ మాస్ ట్యూన్ ఇచ్చాడ‌ని, ఆ పాట 2020 మార్మోగ‌డం ఖాయ‌మ‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. దేవి నుంచి ఈమ‌ధ్య స‌రైన ఆల్బ‌మ్ రాలేదు. అందుకే దేవి కూడా ఈ సినిమాపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాడ‌ట‌. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో జరిగే క‌థ ఇది. ఎక్కువ భాగం అడ‌వుల్లో చిత్రీక‌రించ‌నున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com