ప‌ర‌శురామ్ పారితోషికం: 4+4+2

ఎట్ట‌కేల‌కు ప‌రశురామ్ సినిమా ప‌ట్టాలెక్కుతోంది. నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నుంది. `గీత గోవిందం` త‌ర‌వాత ప‌ర‌శురామ్ సినిమా ప‌ట్టాలెక్కించిన సినిమా ఇదే. మ‌ధ్య‌లో ప్ర‌భాస్ నుంచి అఖిల్ వ‌ర‌కూ హీరోలంద‌రినీ ట్రై చేశారు. కానీ వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. మొత్తానికి చైతూతో ప్రాజెక్టు ఖాయం అయ్యింది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది.

ఈ సినిమాకి గానూ ప‌ర‌శురామ్‌కి 10 కోట్ల పారితోషికం అందిస్తున్నారు. తొలి విడ‌త‌గా రూ.4 కోట్లు అడ్వాన్సుగా ముట్టింది. సినిమా పూర్త‌య్యాక మ‌రో 4 కోట్లు ఇస్తారు. లాభాలొస్తే మ‌రో 2 కోట్లు ఇవ్వ‌డానికి ఒప్పందం జ‌రిగింది. అంటే ఈ పారితోషికాన్ని మూడు విడ‌త‌లుగా ఇస్తున్నార‌న్న‌మాట‌. గీత గోవిందం రూ.100 కోట్లు సాధించింది. అప్ప‌ట్లో ఆయ‌న‌కు పారితోషిక రూపంలో అందింది త‌క్కువే. కానీ వంద కోట్లు కొట్టాక మాత్రం భారీ మొత్తం బోన‌స్‌గా ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఏకంగా పారితోషికమే 10 కోట్లు అంద‌నుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమరావతిని కొనసాగిస్తే పదవుల్ని ఇచ్చేస్తాం..! జగన్‌గు చంద్రబాబు ఆఫర్..!

అమరావతిని ఏకైక రాజధాని కొనసాగిస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులను వదిలేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి జగన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు...

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్..!

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాతి రోజే...అంటే జూన్ 13న హైదరాబాద్‌లో వారిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురంకు తరలించారు....
video

క‌ల‌ర్ ఫొటో టీజ‌ర్‌: బ్లాక్ అండ్ వైట్ కాంబో

https://www.youtube.com/watch?v=T-R3h9va2j4&feature=emb_title ప్రేమ గుడ్డిది. చెవిటిది. మూగ‌ది కూడా. దానికి ప్రేమించ‌డం త‌ప్ప బేధాలు తెలీవు. న‌ల్ల‌ని అబ్బాయి.. తెల్ల‌ని అమ్మాయి ప్రేమించుకోవ‌డం కూడా వింతేం కాదు. కానీ.. మ‌ధ్య‌లోకి ఓ పులి వ‌చ్చింది....

బ్రహ్మానందం ట్రాజెడీ

బ్ర‌హ్మానందం అంటేనే.. ఆనందం. ఆనందం అంటేనే బ్ర‌హ్మానందం. హాస్య పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ బ్ర‌హ్మీ. త‌న కామెడీ ట్రాక్ తోనే సినిమా హిట్ట‌యిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. అయితే ఇప్పుడు బ్ర‌హ్మానందం జోరు త‌గ్గింది....

HOT NEWS

[X] Close
[X] Close