‘వెంకీమామ‌’… ఇంకో క్లైమాక్స్ ఉందా?

వెంక‌టేష్ – నాగ‌చైత‌న్య కాంబోలో తెర‌కెక్కిన `వెంకీ మామ‌` శుక్ర‌వారం విడుద‌లైంది. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్ అందుకుంది. క‌థ‌లో ప‌స లేద‌ని విశ్లేష‌కులు తేల్చేశారు. ప‌తాక స‌న్నివేశాలు మ‌రీ కామెడీగా అనిపిస్తున్నాయి. చ‌నిపోయిన మావ‌య్య ద‌గ్గ‌ర‌కు అల్లుడు వ‌చ్చి..`మామా..` అని పిల‌వ‌డంతో మావ‌య్య క‌ళ్లు తెరుస్తాడు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి క్లైమాక్సులే చూస్తూ వ‌చ్చారు తెలుగు ప్రేక్ష‌కులు. అలాంటి రొటీన్ రొడ్డ‌కొట్ట‌డు క్లైమాక్స్ ఈ సినిమాలో మ‌ళ్లీ వాడ‌డంతో సెటైర్లు ప‌డ్డాయి.

నిజానికి ఈ సినిమా కోసం రెండు క్లైమాక్సులు అనుకున్నారు. రెండింటినీ షూట్ చేశారు. ఓ క్లైమాక్స్‌లో వెంకీ పాత్ర చ‌నిపోతుంది. మ‌రో క్లైమాక్స్ మ‌నం చూస్తున్న‌ది. రెండూ షూట్ చేయ‌మ‌ని, కావ‌ల్సింది వాడుకోవ‌చ్చ‌ని నిర్మాత సురేష్ బాబు సూచించారు. దానికి త‌గ్గ‌ట్టు రెండూ తీశారు. కానీ.. మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు యాంటీ క్లైమాక్సులు ప‌డ‌వు. పైగా క‌థ ప్ర‌కారం.. జాత‌కాన్ని ప్రేమ గెల‌వాలి. దానికి త‌గిన‌ట్టుగానే క్లైమాక్స్‌ని డిజైన్ చేశారు. కాక‌పోతే అది మ‌రీ ఓవ‌ర్‌గా అనిపించిందంతే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమరావతిని కొనసాగిస్తే పదవుల్ని ఇచ్చేస్తాం..! జగన్‌గు చంద్రబాబు ఆఫర్..!

అమరావతిని ఏకైక రాజధాని కొనసాగిస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులను వదిలేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి జగన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు...

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్..!

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాతి రోజే...అంటే జూన్ 13న హైదరాబాద్‌లో వారిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురంకు తరలించారు....
video

క‌ల‌ర్ ఫొటో టీజ‌ర్‌: బ్లాక్ అండ్ వైట్ కాంబో

https://www.youtube.com/watch?v=T-R3h9va2j4&feature=emb_title ప్రేమ గుడ్డిది. చెవిటిది. మూగ‌ది కూడా. దానికి ప్రేమించ‌డం త‌ప్ప బేధాలు తెలీవు. న‌ల్ల‌ని అబ్బాయి.. తెల్ల‌ని అమ్మాయి ప్రేమించుకోవ‌డం కూడా వింతేం కాదు. కానీ.. మ‌ధ్య‌లోకి ఓ పులి వ‌చ్చింది....

బ్రహ్మానందం ట్రాజెడీ

బ్ర‌హ్మానందం అంటేనే.. ఆనందం. ఆనందం అంటేనే బ్ర‌హ్మానందం. హాస్య పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ బ్ర‌హ్మీ. త‌న కామెడీ ట్రాక్ తోనే సినిమా హిట్ట‌యిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. అయితే ఇప్పుడు బ్ర‌హ్మానందం జోరు త‌గ్గింది....

HOT NEWS

[X] Close
[X] Close