విక్రం దర్శకత్వంలో స్టైలిష్ స్టార్

‘ఇష్క్’ సినిమాతో హీరో నితిన్ని గట్టెకించిన దర్శకుడు విక్రం. తరువాత నటసామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘మనం’ సినిమాకి దర్శకత్వం వహించి తన ప్రతిభను మరోమారు చాటుకొన్నారు. కానీ ఆ తరువాత తమిళంలో హీరో సూర్యతో ‘24’ అనే ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా చేయడానికి కోలీవుడ్ వెళ్లిపోయారు. మరొక నెల-నెలన్నరలోగా ఆ సినిమా షూటింగ్ పూర్తవబోతోంది. అది పూర్తవగానే మళ్ళీ టాలివుడ్ కి తిరిగివచ్చి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నారు. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఒక సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన తరువాతనే విక్రంతో సినిమా మొదలుపెడతారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో వీరిరువురి సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. దసరా తరువాత ఎప్పుడయినా ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టవచ్చని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“ఆ” కేసులో నారాయణకు ఊరట.. పట్టించుకోని చంద్రబాబు !

చంద్రబాబును ఏ వన్‌గా నారాయణ ఏ - 2గా చేర్చి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో తదుపరి...

ఎఫ్3 లో అందరి హీరోల ఫ్యాన్స్ కోసం స్పెషల్ బ్లాక్

ఎఫ్2 ఎవరూ ఊహించని విజయం అందుకుంది. ఈ విజయం చిత్ర యూనిట్ కి గ్రేట్ ఎనర్జీగా పని చేసింది. ఎఫ్ 2 ఫ్రాంచైజ్ లో సినిమాలు వస్తూనే ఉంటాయని నిర్మాత దిల్ రాజు...

రెండు, మూడు నెలల్లో కేసీఆర్ “సంచలన వార్త”

రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బెంగళూరులో ప్రకటించారు. దేశంలో ఓ సంచలనం జరగాల్సి ఉందని .. జరుగుతందని ఢిల్లీలో కేజ్రీవాల్‌ను కలిసిన...

మూఢ నమ్మకాలు నమ్మను.. టెక్నాలజీని నమ్ముతా : మోదీ

తెలంగాణ పర్యటనకు వచ్చిన నరేంద్రమోడీ కేసీఆర్ నమ్మకాలపై సెటైర్లు వేశారు. తాను మూఢనమ్మకాలను నమ్మి పనులు చేయబోనని.. తాను టెక్నాలజీని నమ్ముతానన్నారు. ఐఎస్‌బీ ఇరవయ్యో వార్షికోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ఎయిర్‌పోర్టులో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close