మళ్ళీ సాహసం చేస్తున్న రానా

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసమే ఊపిరిగా సాగిపో’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇందులో నాగచైతన్య, మలయాళీ నటి మంజిమ మోహన్ జంటగా నటిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే బాహుబలి సినిమాలో ప్రతినాయక పాత్రలో మెప్పించిన రానా కూడా ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నాగ చైతన్యతో ఉన్న అనుబంధం కారణంగా దర్శకుడు కోరగానే రానా ఈ సినిమా చేసేందుకు అంగీకరించారు. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాలో రానా, మంజిమ నటిస్తున్నారు కానీ నాగ చైతన్య నటించడం లేదు. తమిళంలో హీరో పాత్రను శింభు చేస్తున్నారు. ఇంతకు ముందు గౌతం మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య చేసిన ‘ఏం మాయ చేసావే’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ చాలారోజుల తరువాత వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. హీరో నాగార్జున పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. కానీ అందులో హీరో, హీరోయిన్లు కానీ సినిమాలో నటిస్తున్నఎవరూ లేకపోవడం చాలా వెరైటీగా ఉంది. హైవే రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఒక బైక్, దాని హ్యాండిల్ కి తగిలించిన ఒక హెల్మెట్, దూరం నుండి వస్తున్న ఒక కారు మాత్రమే కనబడుతాయి. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో గురు ఫిలిమ్స్ బ్యానర్లో ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమిళంలో గౌతం మీనన్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరాకి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : పోలవరం నిర్వీర్యం రాష్ట్ర ద్రోహమే..!

"ఓట్లేసిన ప్రజలకు మంచి చేయకపోయినా పర్వాలేదు.. కానీ కీడు మాత్రం చేయకూడదు..." .. అధికారం అందే వరకూ రాష్ట్ర ప్రయోజనాలు.. ప్రజాశ్రేయస్సు మాటలు చెప్పే రాజకీయ నాయకులు.. అధికారం అందగానే.. భిన్నమైన మార్గంలో...

దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపుపై కేసీఆర్ ఎంత నమ్మకమో..!?

దుబ్బాక ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చాలా క్లారిటీగా ఉన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభించిన తర్వాత మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేసీఆర్.. దుబ్బాకలో గెలుపు ఎప్పుడో డిసైడైపోయిందని తేల్చారు....

సంచైతకు కౌంటర్‌గా ఊర్మిళా గజపతి..!

విజయనగరం రాజుల ఫ్యామిలీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పెట్టిన చిచ్చును.. రాజకీయంగానే ఎదుర్కోవాలని... ఇంక ఏ మాత్రం సహించకూడదని... గజపతుల కుటుంబం నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్‌గా...

రాయలసీమ ఎత్తిపోతలను రిస్క్‌లో పెట్టేసిన ఏపీ సర్కార్..!

ముందూ వెనుకా చూసుకోకుండా.... రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై దూకుడుగా వెళ్లిన ఏపీ సర్కార్.. ఆ ప్రాజెక్ట్‌ను పూర్తిగా రిస్క్‌లో పడేసింది. టెండర్లు ఖరారు చేసి..మేఘా కన్సార్టియంకు పనులు అప్పగించేసిన తర్వాత ఇప్పుడు......

HOT NEWS

[X] Close
[X] Close