బాల‌య్య సినిమా చూసిన బ‌న్నీ

అల్లు కుటుంబానికీ బాల‌య్య‌కూ అనుబంధం ఈమ‌ధ్య బాగా బ‌ల‌ప‌డింది. ఆహాలో.. అన్ స్టాప‌బుల్ కి బాల‌య్య హౌస్ట్ గా రావ‌డం ద‌గ్గ‌ర్నుంచి ఈ బాండింగ్ స్ట్రాంగ్ అవ్వ‌డం మొద‌లైంది. అఖండ ప్రీ రిలీజ్‌కి బ‌న్నీ అతిథిగా వెళ్లాడు. ఊర్వ‌శివో.. రాక్ష‌సివో ప్ర‌మోష‌న్ల‌లో బాల‌య్య క‌నిపించాడు. అలా… ఇచ్చిపుచ్చుకోవ‌డం ఇద్ద‌రికీ అల‌వాటైంది. వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్‌కి బ‌న్నీ వ‌స్తాడ‌ని అంతా అనుకొన్నారు. కానీ.. ఈ సినిమాకి పోటీగా `వాల్తేరు వీర‌య్య‌` ఉండ‌డంతో.. బ‌న్నీ ఆ ఫంక్ష‌న్‌కి వెళ్ల‌లేదు. అయితే ఇప్పుడు బాల‌య్య‌పై త‌న అభిమానాన్ని చాటుకొన్నాడు బ‌న్నీ.

ప్ర‌స్తుతం పుష్ప 2 షూటింగ్ విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ గ్యాప్ లో.. విశాఖ లోని మాస్ థియేట‌ర్లో బ‌న్నీ `వీర సింహారెడ్డి` చూశాడ‌ట‌. ఈ సినిమా బ‌న్నీకి బాగా న‌చ్చింద‌ని అందుకే బాల‌య్యకు ఫోన్ చేసి త‌న అభినంద‌న‌లు తెలిపాడ‌ని స‌మాచారం. ఈ సినిమా విజ‌యంతో ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ఫుల్ ఖుషీగా ఉన్నాడు. తాజాగా ర‌జ‌నీకాంత్ ఫోన్ చేసి అభినంద‌న‌లు తెలప‌డంతో.. ఆయ‌న ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close