జ‌మున బ‌యోపిక్‌లో త‌మ‌న్నా?

ఓ అగ్ర తార చ‌నిపోయిన మ‌రుక్ష‌ణం.. బ‌యోపిక్ తీస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచ‌న వ‌స్తుందేమో..? ఈమ‌ధ్య అలానే జ‌రిగింది. ఇప్పుడు జమున విష‌యంలోనూ ఇలానే ఆలోచిస్తోంది చిత్ర‌సీమ‌. దాదాపు 200 చిత్రాల్లో న‌టించి, అగ్ర తార‌గా గుర్తింపు పొందిన జ‌మున ఇటీవ‌లే ఈ లోకాన్ని వ‌దిలి వెళ్లిపోయారు. ఇంత‌లోనే ఆమె బ‌యోపిక్ టాపిక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఓ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు.. జ‌మున బ‌యోపిక్ తీయాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. జ‌మున పాత్ర కోసం త‌మ‌న్నాని సంప్ర‌దించే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ని టాక్‌.

జ‌మున జీవితంలో `సినిమాటిక్‌` విష‌యాలు చాలానే ఉన్నాయి. ఆమె అగ్ర‌తార‌గా కొన‌సాగింది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్ లాంటి ఉద్దండుల చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టించింది. ఒక‌ప్పుడు వారిద్ద‌రే.. జ‌మున‌ని దూరం పెట్టారు. మూడేళ్ల పాటు సినిమాలు చేయ‌లేదు. అయినా స‌రే, నిల‌దొక్కుకొంది. మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌చ్చింది. మ‌ళ్లీ హిట్లు కొట్టింది. జ‌మున‌లో భానుమ‌తి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ఆమె డేరింగ్ అండ్ డాషింగ్‌. ఎవ‌రికీ త‌లొంచేది కాదు. ఇవ‌న్నీ సినిమా క‌థ‌కు ప‌నికొచ్చే విష‌యాలే. కాక‌పోతే… సావిత్రి క‌థ‌లోలా జ‌మున క‌థ‌లో హ్యూమ‌న్ ఎమోష‌న్లు బ‌లంగా ఉంటాయా? అనేది ఆలోచించుకోవాలి. జ‌మున పాత్ర‌లో త‌మ‌న్నాని ఊహించుకోవ‌డం కూడా బాగానే ఉంది. మ‌రి.. ఈ ప్రాజెక్టు వర్కవుట్ అవుతుందో, లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“ఆహా” ఆదాయం కన్నా నష్టాలే ఎక్కువ !

ప్రముక ఓవర్ ది టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా మంచి పనితీరు కనబరుస్తున్నప్పటికీ నష్టాలు మాత్రం ఆదాయం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. భారత కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సమర్పించిన...

ఇప్పుడు “మంత్రుల టిక్కెట్లు” చింపే ధైర్యం ఉందా !?

ముగ్గురు, నలుగురు టిక్కెట్లు చినిగిపోతాయని సీఎం జగన్ కేబినెట్ సమావేశంలోనే మంత్రుల్ని హెచ్చరించారు. ఆ తర్వాతి రోజే ఎవరెవర్ని తీసేస్తారు.. ఎవరెవర్ని తీసుకుంటారు అనే లీకులు కూడా సజ్జల క్యాంప్ నుంచి...

ప్రభం”జనం”లా మారుతున్న లోకేష్ పాదయాత్ర !

లోకేష్ పాదయాత్రకు వస్తున్న జనం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ రోజుకారోజూ అంచనాలకు అంతనంత మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా గోరంట్లలో లోకేష్ పాదయాత్రలో...

ఏపీ పేరును ” వైఎస్ఆర్‌ ఏపీ ” అని మార్చేశారా !?

ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ విధానం అమలు చేయాలంటే... ఏపీ అని ప్రారంభిస్తుంది. అంటే ఏపీ భవన నిర్మాణ విధానం, ఏపీ పారిశ్రామిక విధానం,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close