ఫ్లాప్ డైరెక్ట‌ర్‌తో మెగా హీరో

ఈవార‌మే.. `ఏ బీ సీ డీ` అంటూ అక్ష‌రాలు దిద్దించాడు అల్లు శిరీష్‌. ఆ సినిమా జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా, వెంట‌నే మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అయ్యాడు. ప్రేమ్ సాయి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు శిరీష్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ చిత్రంలో క‌థానాయిక కూడా ఫిక్స‌యిపోయింది. `స‌వ్య‌సాచి`, `మ‌జ్ను` చిత్రాల‌ నాయిక నిధి అగ‌ర్వాల్ ని అల్లు శిరీష్ ప‌క్క‌న ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. నితిన్ సినిమా `కొరియ‌ర్ బోయ్ క‌ల్యాణ్‌`తో ప్రేమ్ సాయి తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. చాలా కాలం నుంచి ఓ స్క్రిప్టు ప‌ట్టుకుని తిరుగుతున్నాడు. యేడాది క్రిత‌మే ఈ సినిమా చేయాల‌ని డిసైడ్ అయ్యాడు. గీతా ఆర్ట్స్ లో ప్రేమ్ సాయి… ఈ క‌థ‌పై యేడాది నుంచి క‌స‌ర‌త్తులు చేస్తూనే ఉన్నాడు. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాని ప‌ట్టాలెక్కించాల‌ని శిరీష్ భావిస్తున్నాడు. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com