ఎగ్జిట్ పోల్ ఫ‌లితాల‌తో అమిత్ షా మైండ్ గేమ్..!

నిన్న ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే ముందువ‌ర‌కూ జాతీయ రాజ‌కీయాల్లో భాజ‌పా ప‌రిస్థితి వేరు, ఇప్పుడు వేరు అన్నట్టుగా క‌నిపిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలో విప‌క్షాల‌న్నీ ఒకే కూట‌మిగా ఏర్ప‌డేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇదే సంద‌ర్భంలో కొత్త పొత్తుల కోసం మోడీ కూడా చూస్తున్నార‌న్న‌ట్టుగా ప్ర‌క‌ట‌న‌లూ న‌డిచాయి. అయితే, ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు కేంద్రంలో మోడీ నేతృత్వంలోని భాజ‌పాకి అనుకూలంగా ఉన్నాయ‌ని తేల్చాయో… ఆ పార్టీలో సంబ‌రాలు మొద‌లైపోయాయి. భాజ‌పాకి అనుకూలంగా స‌ర్వేలు ఉన్నాయి కాబ‌ట్టి, ఆ పార్టీవారికి కొంత ఆనందంగా ఉండ‌టం స‌హ‌జం. అయితే, మ‌రో అడుగు ముందుకేసి… ఎన్డీయే పార్టీల‌కు విందులు కూడా ఇచ్చేయ‌బోతున్నారు భాజ‌పా జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా. ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం నాడు భాగ‌స్వామ్య ప‌క్షాల‌కు విందు ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం! అదేంటీ, అసలు ఫ‌లితాలు రాక‌ముందే ఈ స్థాయిలో సంబ‌రాలు ఏంటా అనిపిస్తుంది క‌దా! కానీ, ఇలా సంబ‌రాలు చేసుకోవ‌డం, విందులు ఇవ్వ‌డం వెన‌క కూడా ఒక మైండ్ ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు నూటికి నూరు శాతం నిజ‌మౌతాయ‌న్న గ్యారంటీ లేదు. కానీ, ప్ర‌స్తుతం వెల్ల‌డైన ఫ‌లితాల ప్ర‌భావం ప్ర‌తిప‌క్షాల‌పై బ‌లంగా క‌నిపిస్తోంది. ఇవాళ్ల సోనియా, రాహుల్ గాంధీల‌తో ఢిల్లీలో మాయావ‌తి భేటీ జ‌ర‌గాల్సి ఉంది. ఎగ్జిట్ పోల్స్ వ‌ల్ల అది వాయిదా ప‌డింద‌ని అంటున్నారు. యూపీలో మాయావ‌తి కూట‌మి ఈసారి జాతీయ రాజ‌కీయాల్లో కీల‌కం కాబోతున్నార‌నే అంచ‌నాల మ‌ధ్య‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆమెతో చ‌ర్చించారు. కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు అసాధ్య‌మ‌ని చెబుతూ వ‌చ్చిన ఆమె… రాహుల్ తో భేటీకి సిద్ధం కావ‌డం ప్ర‌తిప‌క్షాల్లో మంచి ఊపును తెచ్చిన ప‌రిణామ‌మే. ఎప్పుడైతే ఈ ఎగ్జిట్ పోల్స్ బ‌య‌ట‌కి వ‌చ్చాయో… ఈ స‌మావేశం ఆగింది. సోనియా అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గాల్సిన విప‌క్షాల స‌మావేశంపై కూడా కొన్ని అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి.

ఇది అమిత్ షా మైండ్ గేమ్ నేప‌థ్యంలో చోటు చేసుకున్న మార్పుగా చూడొచ్చు. ఎలా అంటే… భాజ‌పాలో ఒక్క‌సారిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగిన‌ట్టు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఎన్డీయే కూట‌మిని సంబ‌రాల మూడ్ లోకి తెచ్చేశారు. విందులు కూడా ఇస్తున్నారు. అంటే, రాబోయేది వారి ప్ర‌భుత్వ‌మే కాబ‌ట్టి… విప‌క్షాల‌న్నీ ఒక కూట‌మిగా ఏర్ప‌డ్డా, దాన్లో చేర‌డం సరికాదేమో అనే ఆలోచ‌నా ధోర‌ణిలోకి ఇత‌ర పార్టీల‌ను నెట్టాల‌నేదే షా వ్యూహంగా క‌నిపిస్తోంది. దీంతోపాటు, కొన్ని మిత్ర‌ప‌క్షాలు భాజ‌పాకి కాస్త దూర‌మ‌య్యే ఆలోచ‌న‌లో ఉన్నాయ‌న్న‌దీ తెలిసందే. ఇప్పుడీ ఎగ్జిట్ పోల్ సంబ‌రాల‌తో వాళ్ల‌నీ ఎటూ క‌ద‌ల‌నీయ‌కుండా ఉంచెయ్యొచ్చు అనేది వారి మైండ్ గేమ్ గా క‌నిపిస్తోంది. లేదంటే, ఎగ్జిట్ పోల్ అంచ‌నాల‌కే జాతీయ పార్టీలు సంబ‌రాలు చేసుకునే ప‌రిస్థితి ఎప్పుడైనా చూశామా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close