ప‌వ‌న్ తొలి ఛాన్సు ఏ.ఎం.ర‌త్నం కే!

ప‌వ‌న్ ఎంట్రీ దాదాపుగా ఖాయ‌మైపోయింది. ఈ సినిమాకి రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ప్ర‌చారం గ‌ట్టిగా సాగుతోంది. అయితే… ప‌వ‌న్ మాత్రం తొలి ఛాన్స్ ఏ.ఎం.ర‌త్నంకే ఇచ్చాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ర‌త్నం ఇది వ‌ర‌కే ప‌వ‌న్‌కి అడ్వాన్స్ ఇచ్చాడు. అది కూడా భారీ మొత్తంలో. ప‌వ‌న్ ఒక్క సినిమాకి తీసుకునే పారితోషికం మొత్తాన్ని సింగిల్ పేమెంట్‌లో అడ్వాన్సు రూపంలో ఇచ్చేశాడు. ముందు ఆ అడ్వాన్స్ క్లియ‌ర్ చేయాల్సిన బాధ్య‌త ప‌వ‌న్‌పై ఉంది. మిగిలిన నిర్మాత‌లు ఇచ్చిన అడ్వాన్సు తిరిగి ఇచ్చాడు గానీ, ఏ.ఎం ర‌త్నం డ‌బ్బులు మాత్రం మ‌ళ్లీ ఇవ్వ‌లేకపోయాడు. అందుకే ముందు ర‌త్నంకి సినిమా చేయాల‌ని ప‌వ‌న్ డిసైడ్ అయ్యాడ‌ని టాక్‌. క్రిష్‌తో ప‌వ‌న్ ఓ సినిమా చేయ‌డం దాదాపుగా ఖాయ‌మైపోయింది. ఈ చిత్రానికి ర‌త్నం నిర్మాత‌. మైత్రీ మూవీస్ కూడా ఇప్పుడు ప‌వ‌న్‌తో సినిమా చేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోంది. దిల్ రాజు కూడా రెడీ అంటున్నాడు. ఆ త‌ర‌వాతే… చ‌ర‌ణ్‌కి ఛాన్సు వ‌స్తుందేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ : రాంగోపాల్ వ‌ర్మ ‘ క్లైమాక్స్‌ ‘

పాడుబ‌డ్డ బావిలో మురికే ఉంటుంది. ఒక‌ప్పుడు తీయ్య‌టి నీళ్లు ఇచ్చింది క‌దా అని, ఓ గుక్కెడు నీళ్లు గొంతులోకి దించుకోం క‌దా..? రాంగోపాల్ వ‌ర్మ అదే టైపు. శివ నుంచి స‌ర్కార్ వ‌ర‌కూ... 'సినిమా...

జగన్ తో భేటీతో సినీ పరిశ్రమ సాధించేది ఏమీ లేదు: బాలకృష్ణ

జగన్ తో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు త్వరలో భేటీ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తో సినీ పరిశ్రమ భేటీ అయిన సందర్భంలో తనను పిలవలేదని బాలకృష్ణ అలగడం, భేటీకి హాజరైన పరిశ్రమ...

సూర్య తండ్రిపై కేసు పెట్టిన టీటీడీ..!

తమిళ స్టార్ సూర్య తండ్రి శివకుమార్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం కేసు పెట్టింది. తమిళనాడులో జరిగిన ఓ సభలో శివకుమార్‌ తిరుమల ఆలయానికి వెళ్లవద్దని పిలుపునిచ్చిట్లుగా టీటీడీకి ఫిర్యాదు అందింది. తిరుమలలో డబ్బులున్న...

కేటీఆర్‌కు ఎన్జీటీ నోటీసులతో రేవంత్ దూకుడు..!

మంత్రి కేటీఆర్ తన పదవికి రాజీనామా చేస్తే.. జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎన్జీటీ వేసిన కమిటీ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అంటున్నారు. జన్వాడలో ఉన్న కేటీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close