చంద్ర‌శేఖ‌ర్ యేలేటి.. ఓ లేడీ ఓరియెంటెడ్ స్టోరీ

సున్నిత‌మైన‌, వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ చంద్రశేఖ‌ర్ యేలేటి. త‌న సినిమాలు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు గానీ, ద‌ర్శ‌కుడిగా మాత్రం తానెప్పుడూ నిరుత్సాహ‌ప‌ర‌చ‌లేదు. ప్ర‌స్తుతం నితిన్ తో ఓసినిమా చేస్తున్నాడు. భ‌వ్య ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆ త‌ర‌వాత మైత్రీ మూవీస్‌లో చందూ ఓ సినిమా చేయాల్సివుంది. ఇదో లేడీ ఓరియెంటెడ్ క‌థ అని తెలుస్తోంది. ఈ క‌థ‌ని ఇది వ‌ర‌కే శ్రియ‌కు వినిపించాడ‌ట‌. శ్రియ కూడా ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకుంద‌ని తెలుస్తోంది. ఓ కీల‌క‌మైన పాత్ర కోసం అర‌వింద్ స్వామిని ఎంచుకోవాల‌ని చూస్తున్నార్ట‌. అర‌వింద్ స్వామి ఉంటే… ఈ సినిమాని త‌మిళంలోనూ మార్కెట్ చేసుకోవ‌చ్చు. అందుకే… శ్రియ‌, అర‌వింద్ స్వామి.. ఇలా వివిధ భాష‌ల్లో మార్కెట్ ఉన్న‌వాళ్ల‌ని న‌టీన‌టులుగా ఎంచుకుంటున్నారు. నితిన్ సినిమా పూర్త‌యిన వెంట‌నే చందూ – శ్రియ కాంబోలో సినిమా మొద‌ల‌య్యే ఛాన్సుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com