ఓంకార్ త్యాగం ఫ‌లితాన్ని ఇస్తుందా?

రాజుగారి గ‌దితో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ కొంత పేరు తెచ్చుకున్నాడు ఓంకార్‌. ఆ వెంట‌నే నాగార్జున‌ని ఒప్పించి రాజుగారి గ‌ది 2 తీశాడు. రాజుగారి గ‌ది 3కీ మంచి ఫ్లాట్ ఫామ్ దొరికింది. ఈ సినిమాలో నాగార్జున స్థాయి ఉన్న న‌టుడ్ని ఎవ‌రినైనా తీసుకోవొచ్చు. కానీ త‌న త‌మ్ముడి కోసం ఆ ఛాయిస్‌ని ప‌క్క‌న పెట్టాడు. త‌మ‌న్నాని తీసుకొచ్చి ‘రాజుగారి గ‌ది3’ క్రేజ్ పెంచాల‌ని చూశాడు. కానీ త‌మ‌న్నా హ్యాండివ్వ‌డంతో, అవికాగోర్‌తో స‌ర్దుకుపోయాడు. ఇదంతా త‌మ్ముడు అశ్విన్‌బాబు కోస‌మే. ఈ సినిమా హిట్ట‌యితే, ఆ క్రెడిట్ త‌మ్ముడికీ ద‌క్కాల‌ని, ఆ హిట్టుతో త‌మ్ముడికి ఇంకొన్ని అవ‌కాశాలు రావాల‌న్న‌ది ఓంకార్ ఆశ‌. అయితే… రాజుగారి గ‌ది 2కి ఉన్నంత క్రేజ్, ఈసినిమాకి రాలేదు. దానికి కార‌ణం.. ఇందులో స్టార్ వాల్యూ త‌గ్గ‌డ‌మే. రాజుగారి గ‌దిని మించిన స్టార్ డ‌మ్‌.. పార్ట్ 2లో క‌నిపించింది. అంత‌కు మించి పార్ట్ 3 ఉండాలి. కానీ.. కేవ‌లం త‌మ్ముడికి క్రెడిట్ ద‌క్కాల‌న్న ఉద్దేశంతో ఈసినిమా కోసం స్టార్ ల జోలికి వెళ్ల‌లేదు. మ‌రి ఓంకార్ త్యాగం ఏ మేర‌కు ఫ‌లిస్తుందో తెలియాలంటే శుక్ర‌వారం వ‌ర‌కూ ఆగాల్సిందే. ఎందుకంటే రాజుగారి గ‌ది 3 వ‌చ్చేది అప్పుడే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మరో మూడు నెలలు సీఎస్‌గా సహాని..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి...

ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని... అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి...

సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్‌కు మళ్లీ “రంగు పడింది”..!

ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో ఎక్కడా లేని పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్‌కు.. రెండో సారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు...

డాక్టర్ సుధాకర్‌పైనా సీబీఐ కేసు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ...

HOT NEWS

[X] Close
[X] Close