జగన్‌ను ఆడుకుంటున్న జాతీయ మీడియా..! అమర్ ఏం చేస్తున్నట్లు..?

జాతీయ మీడియాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరువు పోతోంది. చిత్రవిచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తెలివితెక్కువ తనాన్ని .. తమదైన శైలిలో ఎస్టాబ్లిష్ చేస్తోంది. వాటిని చూపించి.. నిజంగానే… ఎన్నికల ప్రచారసభల్లో చెప్పినట్లుగా దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటున్నారని.. సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఈ విషయంలో ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మాత్రం నిమిత్తమాత్రుడిగా మారిపోయారు.

దేశం మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకుంటున్న జగన్..!

విద్యార్థులకు ఇచ్చే అవార్డులకు అబ్దుల్ కలాం పేరు తీసేసి.. వైఎస్ఆర్ పేరు పెట్టిన జీవో బయటకు రావడం ఆలస్యం.. తెలుగు మీడియా కన్నా.. ఇంగ్లిష్, హిందీ మీడియానే అగ్రెసివ్‌గా స్పందించింది. అబ్దుల్ కలాంను.. ఇంత ఘోరంగా అవమానించిన వారు మరొకరు లేరని.. తీర్మానించి.. ఓ ఆటాడుకుది. దాంతో.. జగన్మోహన్ రెడ్డి తూచ్ అనక తప్పలేదు. తనకు తెలియకుండా జీవో వచ్చిందని కవర్ చేసుకున్నారు కానీ.. ఆయన అనుమతితోనే జీవో వచ్చిందన్న విషయాన్ని జాతీయ మీడియా చానళ్లు స్పష్టంగా ప్రకటించాయి. ఇక మీడియాను కట్టడి చేస్తూ.. తీసుకొచ్చిన జీవో విషయంలోనూ.. జాతీయ మీడియా ఎలాంటి మొహమాటాలు పెట్టుకోలేదు. ఇండియా టుడే, న్యూస్ 18, ఎన్డీటీవీ సహా… చిన్నాచితకా ఇంగ్లిష్ చానళ్లు.. జగన్ నిర్ణయాన్ని ఏకి పారేశాయి. ద ప్రింట్ పేరుతో వెబ్ సైట్ నిర్వహించే..శేఖర్ గుప్తా.. జగన్ మీడియాలో ఆర్టికల్స్ రాస్తూంటారు. ఆయన కూడా జగన్ నిర్ణయాన్ని తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. జగన్ సీఎం అయిన తర్వాత హిందూ పత్రిక ఎడిటర్ … అలాగే.. ద ప్రింట్ చీఫ్ ఎడిటర్ శేఖర్ గుప్తా.. ప్రత్యేకంగా వచ్చి ఆయనను కలిశారు. జగన్ పాదయాత్రపై రామచంద్రమూర్తి రాసిన పుస్తకాన్ని శేఖర్ గుప్తా ఆవిష్కరించి పొగడ్తల వర్షం కురిపించారు కూడా. కానీ వీరంతా..ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా.. చెడా మడా తమ మీడియాలో.. జగన్ నిర్ణయాన్ని ఏకిపారేశారు. ఇక జగన్ ఇంటి కిటికీలకు… రూ. 73 లక్షలు విడుదల చేసుకోవడాన్ని జాతీయ మీడియా చీల్చి చెండాడింది. ప్రజాధనాన్ని సొంత అవసరాలకు వాడుకుంటున్న సీఎంగా ఛీత్కరిచింది. జగన్ ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులను రూ. ఐదు వందల కోట్లకుపైగా చూపించారని.. తన సొంత ఇంటికి జగన్ వాటిల్లోంచి ఖర్చు పెట్టుకోలేరా అని సూటిగా ప్రశ్నించింది.

పరువు పోకుండా అంతర్రాష్ట్ర మీడియా సలహాదారు ఎందుకు ఆపలేకపోతున్నారు..?

జగన్ నిర్ణయాలు అంత “బిజారే”గా ఉన్నాయి కాబట్టి.. నేషనల్ మీడియా హైలెట చేస్తూ పరువు తీస్తోందని అనుకున్నా… ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికే.. జగన్మోహన్ రెడ్డి భారీ ఖర్చుతో ఓ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటే.. దేవులపల్లి అమర్. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడిగా నిన్నామొన్నటిదాకా ఉన్న ఆయనకు .. జాతీయ స్థాయిలో ప్రముఖ జర్నలిస్టులతో.. సత్సంబంధాలు ఉంటాయని.. ఆయనను.. అంతర్రాష్ట్ర మీడియా సలహాదారుగా నియమించారు. ఏడాదికి.. యాభై, అరవై లక్షల జీతం ఖరారు చేశారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీలోనూ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇంత చేసినా.. జాతీయ మీడియాలో … జగన్ కు వ్యతిరేకంగా వచ్చే కథనాలు మాత్రం ఆగడం లేదు. కనీసం.. ఘాటు కూడా తగ్గించడం లేదు. దేశంలో ఏ సీఎంపైనా…. చేయనంత ఘాటు వ్యాఖ్యలతో జాతీయ మీడియా.. జగన్ నిర్ణయాలపై కవరేజీ ఇస్తోంది.

అమర్ వల్ల లాభం లేదని ప్రభుత్వ పెద్దల్లో అసంతృప్తి ..?

జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు.. దాని వెనుక ఉన్న ఉద్దేశాలను… జాతీయ మీడియాకు.. కన్వే చేయడంలో దేవులపల్లి అమర్ విఫలమయ్యారన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. పైగా.. మీడియాపై కత్తికట్టే జీవో ఇష్యూ విషయంలో.. ఏపీ సర్కార్ నిర్ణయాన్ని సమర్థించినందుకు.. ఆయన తన పలుకుబడి మొత్తం పోగొట్టుకున్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష పదవి నుంచి కూడా వైదొలగాల్సి వచ్చింది. జగన్ నిర్ణయాలు.. బ్యాక్ గ్రౌండ్‌.. వాటి వల్ల వచ్చే ఫలితాలను.. జాతీయ మీడియాకు.. ఎలా చెప్పి.. అదంతా కరెక్టో … ఒప్పించాలో.. అమర్ కూ తెలియడం లేదంటున్నారు. అందుకే.. జాతీయ మీడియా కవరేజీ ఘాటును తగ్గించే ప్రయత్నంలో ఆయన కూడా విఫలమవుతున్నారంటున్నారు. ఎలా చూసినా.. అమర్ కు.. ఇచ్చిన సలహాదారు పదవితో జగన్ ఏ ప్రయోజనం కలగడం లేదనే అభిప్రాయం మాత్రం అప్పుడే ప్రభుత్వంలో ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బాక్‌: ఎన్టీఆర్ కృష్ణ‌ల ‘కురుక్షేత్ర‌’ యుద్ధం

ఒకేరోజు.. రెండు సినిమాలు, అందునా స్టార్ సినిమాలు విడుద‌ల కావ‌డం కొత్తేం కాదు. కానీ.. రెండూ ఇంచుమించుగా ఒకే క‌థ‌తో విడుద‌లైతే, రెండూ ఒకే జోన‌ర్ అయితే.. ఎలా ఉంటుంది? ఆ...

రానా పెళ్లిలో… ప్ర‌భాస్ ‘బావ‌’ మిస్సింగ్‌

శ‌నివారం రాత్రి రానా -మిహిక‌లు అగ్ని సాక్షిగా ఒక్క‌ట‌య్యారు. లాక్ డౌన్, క‌రోనా గొడ‌వ‌లు లేక‌పోతే, ఈ పెళ్లి ధూంధామ్‌గా జ‌రిగేది. కానీ లాక్ డౌన్ ప‌రిమితుల వ‌ల్ల కేవ‌లం 50మంది అతిథుల‌కే...

అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు : జగన్

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. అందరూ... కోవిడ్ రోగులే. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. దాదాపుగా యాభై మంది కోవిడ్ రోగులు ఆస్పత్రిలో ఉండగా.....

నాని సినిమాని సీక్వెల్ వ‌స్తోంది

వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్ స్థాపించి 'అ' సినిమాతో బోణీ కొట్టాడు నాని. నిర్మాత‌గా త‌న అభిరుచి ఎలాంటిదో తొలి సినిమాతోనే చూపించాడు. ప్ర‌శాంత్ వ‌ర్మ‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశాడు. 'అ' క‌మర్షియ‌ల్ గా...

HOT NEWS

[X] Close
[X] Close