అలీ ఆశ‌లు ఆవిరాయె…

2019 అసెంబ్లీ ఎన్నిక‌ల‌ముందు అలీ కాస్త హైడ్రామా న‌డిపిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ – జ‌న‌సేన – వైకాపా అంటూ అటూ ఇటూ తిరిగి, చివ‌రికి జ‌గ‌న్‌తో కండువా క‌ప్పించుకున్నారు. అయితే సీటు మాత్రం ద‌క్క‌లేదు. జ‌గ‌న్ పార్టీ అధికారం చేప‌ట్టాక అలీకి ఓ ప‌ద‌వి ద‌క్క‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ముఖ్యంగా ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ ప‌దవిపై ఆయ‌న‌కు క‌న్నుంద‌ని బాగా ప్ర‌చారం సాగింది. దానికి త‌గ్గ‌ట్టే అలీ ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ అయిపోయాడ‌ని వార్త‌లూ బాగానే షికారు చేశాయి. రోజా, ఫృథ్వీలాంటి వాళ్ల‌కు నామినేటెడ్ ప‌ద‌వులు ఇచ్చిన‌ప్పుడు అలీ పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపించింది. అయితే అలీ ఆశ‌లు పెంచుకున్న ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి మ‌రో సీనియ‌ర్ న‌టుడు విజ‌య్ చంద‌ర్ ప‌ట్టుకెళ్లిపోయారు. విజ‌య్ చంద‌ర్‌ని ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్‌గా నియ‌మిస్తూ ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం ఈరోజు జీవోని జారీ చేసింది. దాంతో అలీ ఆశ‌లు ఆవిర‌య్యాయి. ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి తన‌కే న‌ని, అలీ చాలా సంద‌ర్భాల్లో స‌న్నిహితుల‌తో చెప్పుకునేవారని తెలిసింది. జ‌గ‌న్‌ని క‌లిసిన‌ప్పుడు కూడా ఈ విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. చివ‌రికి ఏమైందో, ఏమో.. ఆ అవ‌కాశం విజ‌య్ చంద‌ర్‌ని వ‌రించింది. జ‌గ‌న్ హ‌యాంలో ఇప్పుడు పేరెన్న‌ద‌గిన నామినేటెడ్ ప‌ద‌వుల‌న్నీ అయిపోయిన‌ట్టే. క‌నీసం అలీని రాజ్య‌స‌భ‌కైనా పంపుతారేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలుగు రాష్ట్రాల సీఎంలకు షెకావత్ మళ్లీ మళ్లీ చెబుతున్నారు..!

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త ప్రాజెక్టుల అంశం కేంద్రానికి చిరాకు తెప్పిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగే వరకూ..కొత్త ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జలశక్తి మంత్రి...

‘ఈగ’ కాన్సెప్టులో ‘ఆకాశవాణి’?

రాజ‌మౌళి ద‌గ్గ‌ర శిష్యుడిగా ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు ఇప్పుడు మెగా ఫోన్ ప‌ట్టాడు. 'ఆకాశ‌వాణి' సినిమాతో. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రానికి కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌లే...

పుస్త‌క రూపంలో ‘పూరీఇజం’

పూరి సినిమాల్లో డైలాగులు ఎంత ప‌వ‌ర్‌ఫుల్ గా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సూటిగా, గుండెని తాకేలా రాయ‌గ‌ల‌డు. అవ‌న్నీ సినిమాల‌కే ప‌రిమితం కాదు. త‌న జీవ‌న శైలే అలా ఉంటుంది....

పోలీస్ స్టేష‌న్‌లో న‌గ్నంగా `రాడ్‌ గోపాల్ వ‌ర్మ‌`

టాలీవుడ్ లో ఇప్పుడు రెండు ర‌కాల సినిమాలే త‌యార‌వుతున్నాయి. ఓటీటీలో అవే విడుద‌ల అవుతున్నాయి. ఒక‌టి రాంగోపాల్ వ‌ర్మ తీస్తున్న సినిమాలు, రెండోది రాంగోపాల్ వ‌ర్మ‌పై తీస్తున్న సినిమాలు. బ‌యోపిక్‌ల పేరుతో.. వాస్త‌వ...

HOT NEWS

[X] Close
[X] Close