బ‌న్నీ సినిమాలో ప‌వ‌న్ స్టైల్ పాట‌

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి జాన‌ప‌ద గీతాలంటే చాలా ఇష్టం. త‌మ్ముడు, ఖుషి, జానీ సినిమాల్లో జాన‌ప‌ద గీతాల్ని వినిపించారు. అవి మాస్‌కి మాంఛి చిక్ ఇచ్చాయి. ఆయా పాట‌ల్ని ప‌వ‌న్ స్వ‌యంగా ఆల‌పించాడు కూడా. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఓ జాన‌ప‌ద గీతాన్ని వినిపించ‌డానికి రెడీ అయ్యాడు. అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో `అల వైకుంఠ‌పుర‌ములో` తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో శ్రీ‌కాకుళం ఏరియాల్లో బాగా పాపుల‌ర్ అయిన ఓ జాన‌ప‌ద గీతాన్ని వాడుకుంటున్నారు. ఈ పాట‌ని త‌మ‌న్ త‌న‌దైన స్టైల్‌లో స్వ‌ర‌ప‌రిచాడ‌ని తెలుస్తోంది. అయితే ఈ పాట ఆల్బ‌మ్‌లో ఉండ‌దు. సినిమాలో మాత్ర‌మే క‌నిపిస్తుంది, వినిపిస్తుంది. ఈ పాట‌ని అల్లు అర్జున్ పాడ‌తాడా, లేదంటే.. ఎవ‌రితోనైనా పాడిస్తారా? అనేది తెలియాల్సివుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా నుంచి రెండు పాట‌లు విడుద‌ల‌య్యాయి. అవి రెండూ బాగా పాపుల‌ర్ అయ్యాయి. వాటికి మించి ఈ ఫోక్ సాంగ్ ఉండ‌బోతోంద‌ట‌. మ‌రి అది ఏ స్థాయిలో పేలుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వకీల్ సాబ్… వర్క్ మొద‌లైంది

క‌రోనా ఎఫెక్ట్, లాక్ డౌన్‌ల వ‌ల్ల షూటింగులు ఆగిపోయాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కూ ఆటంకం ఏర్ప‌డింది. అయితే కొన్ని సినిమాలు మాత్రం ధైర్యం చేస్తున్నాయి. వీలైనంత వ‌ర‌కూ సినిమాని సిద్ధం చేసే ప్ర‌య‌త్నాల్లో...

ఓటీటీలో రాజ‌మౌళి శిష్యుడి సినిమా

రాజ‌మౌళి శిష్యుడు అశ్విన్ గంగ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'ఆకాశ‌వాణి'. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ధారి. ఈ సినిమా ఓ వెరైటీ కాన్సెప్టుతో తెర‌కెక్కుతోంది. నోరు లేని రేడియో... ఓ భ‌యంక‌ర‌మైన విల‌న్ పై...

పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన కేసులు కూడా ఎత్తేస్తారా..!?

ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు రాను రాను వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే దళితులపై పోలీసుల అరాచకాలు హైలెట్ అవుతూండగా.. తాజాగా..పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి.. పోలీసుల్ని కొట్టి విధ్వంసం సృష్టించిన కేసులను కూడా... ఎత్తేయాలని నిర్ణయించుకోవడం...

వైఎస్-చంద్రబాబు స్నేహంపై దేవాకట్టాకు కాపీరైట్ ఉందా..!?

నిర్మాత విష్ణు ఇందూరి - దర్శకుడు దేవా కట్ట మధ్య నాలుగు రోజుల కిందట.. సోషల్ మీడియాలో ప్రారంభమైన... వైఎస్ - చంద్రబాబు స్నేహం కథపై సినిమా వివాదం టీవీ చానళ్లకు ఎక్కింది....

HOT NEWS

[X] Close
[X] Close