తెలంగాణకు తరలిపోతున్న అమరరాజా పెట్టుబడులు !

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులతో తమ సంస్థను విస్తరించాలనుకున్న అమరరాజా మనసు మార్చుకుంది. గత కొన్నాళ్లుగా ప్రభుత్వ వేధింపులు ఎదుర్కొంటున్న ఆ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తెలంగాణ సర్కార్‌తో ఒప్పందం చేసుకోబోతోంది. పెద్ద ఎత్తున భూములు, ఇతర రాయితీలు ఇచ్చి అమరరాజా పెట్టుబడులను తెలంగాణ స్వాగతిస్తోంది.

అమరరాజా కంపెనీని గల్లా కుటుంబం ప్రారంభించడానికి కారణం వెనుకబడిన చిత్తూరు జిల్లా యువత, మహిళలకు ఉపాధి కల్పించడం. అమెరికా నుంచి తిరికి వచ్చి గల్లా జయదేవ్ తండ్రి బ్యాటరీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. అంచెలంచెలుగా అమరాన్ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. వేల కోట్ల టర్నోవర్ ఉంటుంది. చిత్తూరు జిల్లాల వేలాది కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటాయి. రాజకీయాలకు అతీతంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పరిశ్రమపై రాజకీయ కోణంలో కక్ష సాధింపులన్న ఆలోచనలు చేయలేదు. కానీ .. జగన్ సర్కా‌ర్ మాత్రం .. గల్లా జయదేవ్ టార్గెట్‌గా ఆయన కంపెనీని మూసేయాలని ప్రయత్నించింది.

అధికారుల తప్పుడు నివేదికలతో రెండు సార్లు కరెంట్ నిలిపివేసి ఉత్పత్తికి ఆటంకం కలిగించారు. క్లోజర్ నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో ఇక రాజకీయ కక్ష సాధింపులకు నిలయమైన ఏపీలో ఇక పెట్టుబడులు పెట్టడం ఏ మాత్రం శ్రేయం కాదని నిర్ణయించుకున్నారు. బ్యాటరీ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో .. కొన్ని వేల కోట్ల పెట్టుబడులను అమరరాజా పెడుతోంది. ఇవన్నీ తెలంగాణకు తరలి పోతున్నాయి.

ఏపీ సర్కార్ బయట వ్యక్తుల నుంచి పెట్టుబడులు తెప్పించలేకపోతోంది. కనీసం ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడలేకపోతున్నారు. ఓ రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసే ప్రభుత్వం.. గతంలో ఎప్పుడూ ఉండదు.. ఇక ముందురాదని ఎవరైనా అనుకుంటే.. దానికి ఈ ప్రభుత్వ పెద్దలే కారణం అవుతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైతన్య : వైసీపీ నేతలే కావొచ్చు కానీ మీరు మనుషులయ్యా.. గుర్తుంచుకోండి !

గుండెపోటు వచ్చిన ఓ మనిషి చావు బతుకుల్లో ఉంటే అతనిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడిన వీడియో చూసిన తరవాత ఎవరికైనా మనం మనుషులం అనే సంగతిని మార్చిపోతున్నామా అని...

ఏపీ ఆలయాల్లో దేవుడ్నే లెక్క చేయడం లేదంటున్న రమణదీక్షితలు !

టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఏపీలో ఆలయాల పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీలోని ఆలయాల్లో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని.. ఆలయ అధికారులు వారి ప్రణాళికలు, వారి...

పెగాసస్ నిఘా పెట్టారని కనిపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే !

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనపై ప్రభుత్వం పెగాసస్ ప్రయోగించిందని ఆరోపిస్తున్నారు తన ఫోన్లు అన్నీ ట్యాప్ అవుతున్నాయని తనపై నిఘా కోసమే ప్రత్యేకంగా ముగ్గురు అధికారుల్ని పెట్టారని ఆయన...

ఢిల్లీ పిలవట్లేదు.. తాడేపల్లిలో ఉండాలనిపించడం లేదు !

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అర్జంట్ గా ఢిల్లీ వెళ్లి కొన్ని పనులు చక్క బెట్టాలనుకుంటున్నారు. కానీ ఢిల్లీ నుంచి పిలుపు రావడం లేదు. ఉన్నపళంగా ఢిల్లీ వెళ్లకపోతే చాలా సమస్యలు వస్తాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close