‘అమరావతి’ నిర్మాణంతో అనర్థం: ఐక్యరాజ్యసమితి నివేదిక

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిర్మించబోయే నూతన రాజధాని అమరావతి వలన పర్యావరణానికి తీవ్ర అనర్థం వాటిల్లుతుందని ఐక్యరాజ్యసమితి అనుబంధసంస్థ యూఎన్‌డీపీ(యునైటెడ్ నేషన్స్ డెవలెప్‌మెంట్ ప్రోగ్రామ్) హెచ్చరించింది. పచ్చదనం తగ్గిపోవటం, కాంక్రీట్ నిర్మాణాలు పెరిగిపోవటం, ఆటోమొబైల్, పారిశ్రామిక ఉద్గారాలు అదుపు తప్పటం, పక్కనే ఉన్న ధర్మల్ పవర్ స్టేషన్‌లనుంచి ఉద్గారాలు, చుట్టుపక్కల కొండలలో అనుమతి, అజమాయిషీలేని మైనింగ్ కార్యకలాపాలు, వరి పొలాలు, ఆగ్రో ప్రాసెసింగ్ కార్యకలాపాలనుంచి వెలువడే ఉద్గారాలు అమరావతి ప్రాంత పర్యావరణాన్ని దెబ్బతీస్తాయని యూఎన్‌డీపీ ఇటీవల రూపొందించిన నివేదికలో పేర్కొంది. దీనితో అమరావతి చుట్టుపక్కల వాతావరణం చెడిపోతుందని హెచ్చరించింది. ఇప్పటికే విజయవాడ ప్రాంతం, కోస్తా బెల్ట్ ప్రాంతాలలో అనేకచోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పేర్కొంది. నదులలో, పంటకాలువలలో విస్తృతంగా కాంక్రీట్ కరకట్టలను నిర్మించటం, ఇసుకదిబ్బలు మేట వేయటం వలన రేడియేషన్ పెరగటంతోకూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపింది. దీనికి పరిష్కారంగా – ప్రభుత్వం, పరిశ్రమలు ఇంధన పొదుపు వ్యవస్థలను ఏర్పాటుచేయటానికి ప్రాధాన్యత ఇవ్వాలని, తవ్వకం పూర్తయిన గనులను శాస్త్రీయపద్ధతిలో మూసేయాలని, గ్రీన్ జోన్‌లను ఏర్పాటు చేయాలని సూచించింది.

అమరావతి ప్రాంతం నదిపక్కన ఉంది కాబట్టి అక్కడ నేలకు కుంగిపోయే స్వభావం ఉంటుందని, అదీకాక ఆ ప్రాంతం భూకంపాలు సంభవించే జోన్‌లో ఉందని ఇప్పటికే కొందరు వాదిస్తుండగా ఇప్పుడు ఐక్యరాజ్యసమితి అనుబంధసంస్థ విడుదలచేసిన ఈ నివేదిక మరింత ఆందోళనలను రేకెత్తించేదిగా ఉంది. 1.35 లక్షల ఎకరాలలో అమరావతి రూపుదిద్దుకుంటోందని, 50 అంతస్తులతో సెక్రటేరియట్ నిర్మిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్న చంద్రబాబు బృందం ఈ నివేదికపై ఏమంటుందో! రానున్న అసెంబ్లీ సమావేశాలలోనైనా అమరావతి నిర్మాణంపై సందేహాలను నివృత్తి చేస్తుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీ తల్చుకుంటే శ్రీవారి ఆస్తుల అమ్మకం నిలిపివేత ఎంత సేపు..!?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయంపై బీజేపీ భగ్గమని లేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు దీక్షలకు సిద్ధమయ్యారు..తెలంగాణ నేతలు కూడా.. ఊరుకునేది లేదని.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వయంగా......

ఏడాదిలో 90 శాతం హామీలు అమలు చేశాం : జగన్

మద్యం రేట్లను పెంచడం ద్వారా మద్యం తాగే వారి సంఖ్య 24 శాతం మేర తగ్గిపోయిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చారు. పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. మన పాలన- మీ...

స్టూడియోల‌కు పూర్వ వైభ‌వం

జీవితం ఓ సైకిల్ చ‌క్రం లాంటిది. ఎక్క‌డ మొద‌లెట్టామో తిరిగి అక్క‌డికే వ‌చ్చి ఆగుతాం. సినిమాల ప‌రిస్థితి ఇప్పుడు అలానే మారింది. ఇది వ‌ర‌కూ సినిమా అంటే స్టూడియో వ్య‌వ‌హార‌మే. తొలి స‌న్నివేశం...

విమానాల వాయిదా : తొందరపడినా ప్రభుత్వం సిద్ధం కాలేకపోయిందా..?

దేశమంతా విమనాశ్రయాలు ఓపెన్ అయ్యాయి.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. ఒక్క రోజు వాయిదా పడ్డాయి. కారణాలేమైనా కావొచ్చు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... లాక్ డౌన్ ఎత్తేసి.. సాధారణ కార్యకలాపాలు ప్రారంభించాలని.. లాక్‌డౌన్ 1.0 అయిపోయినప్పుడే...

HOT NEWS

[X] Close
[X] Close