మంత్రి లక్ష్మారెడ్డి డాక్టర్ పట్టాపై వివాదం

హైదరాబాద్: ఇటీవల జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాలలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల డిగ్రీ సర్టిఫికెట్‌లు నకిలీవంటూ వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డికూడా అలాంటి వివాదంలోనే ఇరుక్కున్నారు. లక్ష్మారెడ్డి మున్నాభాయ్ ఎంబీబీఎస్ టైపు డాక్టరని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు మండలకేంద్రంలో ప్రభుత్వ ఆరోగ్యకేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా నిన్న రేవంత్ మంత్రిపై నేరుగా ఈ ఆరోపణ చేశారు. మద్దూరు తన నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోది కావటంతో మంత్రి పాల్గొన్న ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురిమధ్య మాటా మాటా వచ్చినపుడు రేవంత్ మంత్రిపై ఈ ఆరోపణ చేశారు. మరోవైపు ఈ ఆరోపణపై ఒక దినపత్రిక కొంత పరిశోధన చేస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లక్ష్మారెడ్డి చదివింది హోమియోపతి డాక్టర్ కోర్స్. అయితే ఆయన 2004 ఎన్నికలలో దాఖలు చేసిన అఫిడవిట్‌లోనేమో 1988లో గుల్బర్గా యూనివర్సిటీనుంచి బీహెచ్ఎమ్ఎస్ కోర్స్ చేశానని, 2014 ఎన్నికలలో దాఖలు చేసిన అఫిడవిట్‌లోనేమో 1987లో గుల్బర్గాలోని హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీవారి కాలేజిలో బీహెచ్ఎమ్ఎస్ కోర్స్ చేశానని పరస్పర విరుద్ధంగా పేర్కొన్నారు. మరోవైపు లక్ష్మారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, తాను గుల్బర్గా యూనివర్సిటీనుంచి బీహెచ్ఎమ్ఎస్ చేశానని, ఆ పట్టాతో రిజిస్టర్ చేసుకున్నానని, తనది బోగస్ పట్టా అయితే రిజస్టర్ చేసుకోరని చెప్పారు.

పదవులలో ఉన్న రాజకీయ నాయకుల విద్యార్హతలపై వివాదాలు రావటం ఇటీవల ట్రెండ్ అయిపోయింది కాబట్టి లక్ష్మారెడ్డికూడా దీనిని పట్టించుకోనవసరంలేదు. కేంద్ర మానవ వనరులశాఖమంత్రి స్మృతి ఇరాని, ఢిల్లీ న్యాయశాఖమంత్రి జితేందర్ సింగ్ తోమార్, ఆప్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే సురేందర్ సింగ్‌, మహారాష్ట్ర విద్యాశాఖమంత్రి వినోద్ తవ్డేలపై ఇటీవల ఇదే రకమైన ఆరోపణలు వచ్చాయి. స్మృతి ఇరాని వివాదం పార్లమెంటులోకూడా ప్రతిధ్వనించగా, ఇక ఢిల్లీ మంత్రి తోమార్ అయితే అరెస్టయ్యి ఊచలుకూడా లెక్కలుపెట్టారు. రాజకీయాలలో ఇవన్నీ మామూలే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close