అమరావతిలో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జంగిల్ క్లియరెన్స్ చేయడానికే మూడు నెలలు పట్టింది. శిథిలమైన వాటిని మళ్లీ క్లియర్ చేసి.. కొత్త కాంట్రాక్టర్లకు టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించారు. లీగల్ సమస్యలు అన్నీ పరిష్కరించిన తర్వాత ఇప్పుడు దాదాపుగా అన్ని పనులు ప్రారంభమయ్యాయి. అమరావతిలో ఇప్పుడు పదిహేను వేల మంది వరకూ పని చేస్తున్నారు.
ప్రభుత్వం చేపట్టిన పనుల్లోనే పన్నెండు వేల మంది వరకూ పని చేస్తున్నారు. భూములు తీసుకున్న ఇతర సంస్థలు కూడా పనులు ప్రారంభించడంతో ఎక్కడ చూసినా నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం సీఆర్డీఏ భవన్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. జగన్ రెడ్డి ఏడు అంతస్తుల ఈ భవనానికి లిఫ్టు కూడా లేకుండా చేసేలా ప్లాన్ మార్చారు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిలోపే మొత్తం కంప్లీట్ చేసేసింది. ఇప్పుడు ప్రారంభోత్సవానికి రెడీ అయింది.
అదే సమయంలో గతంలో 70శాతం వరకూ పూర్తయిన భవనాల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్వార్టర్స్, జడ్జిల క్వార్టర్స్ అన్నీ జోరుగా నిర్మాణం అవుతున్నాయి. వచ్చే జనవరి నుంచి నెలకు ఓ ప్రాజెక్టు చొప్పున ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ, సచివాలయం టవర్స్, హైకోర్టుల నిర్మాణం ప్రారంభమయింది. వచ్చే రెండే ఏళ్లలో రాజధానికి ఓ రూపం వచ్చే అవకాశం ఉంది.