అమరావతి పనులు ఫుల్ స్వింగ్స్ మీద ఉన్నాయి. పనులు వివిధ సంస్థలకు కేటాయించడంతో ఎవరికి కేటాయించిన ప్రాజెక్టుల్ని వారు పెద్ద ఎత్తున మ్యాన్ పవర్, విదేశీ యంత్రాలను తీసుకు వచ్చి చేయిస్తున్నారు. ఒక్క గంట కూడా పనులు ఆగడం లేదు. ఇరవై నాలుగు గంటలూ పనులు జరిగేలా షిఫ్టుల వారీగా పనులు చేస్తున్నారు . దీంతో అమరావతి మెత్తం రాత్రి సమయంలో కూడా సందడిగా కనిపిస్తోంది.
2019 నాటికి 70 శాతం పూర్తయిన భవనాలను వచ్చే మార్చికల్లా అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జడ్జిలు, ఆఫీసర్ల బంగాళాల్లో ఇంటీరియర్ వర్కులు జరుగుతున్నాయి. గ్రూప్ డీ ఆఫీసర్ల క్వార్టర్స్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అలాగే ఐకానిక్ టవర్ల నిర్మాణం కూడా జోరందుకుంది.మొత్తం ఐదు టవర్లను వేర్వేరు కాంట్రాక్టర్లకు ఇవ్వడంతో ఎవరి పనులు వారు పూర్తి చేస్తున్నారు.
అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇక రోడ్ల వంటి మౌలిక సదుపాయాల పనులు వర్షాల వల్ల కొంత మందగించినప్పటికీ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. రాత్రి పూట కూడా పనులు జరుగుతూండటంతో.. మరో ఏడాదిన్నరలో చాలా వరకూ అమరావతి కళ్ల ముందు ఉంటుందని భావిస్తున్నారు.


