ప్రపంచదేశాల్లో ఎవరి కరెన్సీ వారికి ఉంటుంది. కానీ ప్రపంచ కరెన్సీగా చెలామణిలో ఉంది మాత్రం డాలర్. ఇప్పుడు ప్రతి దేశం విదేశీ మారకద్రవ్యాన్ని డాలర్ల రూపంలోనే ఉంచుకుంటుంది. ఇన్ని బిలియన్ డాలర్లు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటుంది. దీని వల్ల అమెరికా డాలర్లను ముద్రించి ప్రపంచం మీదకు వదిలేస్తోంది. ఆ కారణంగానే అమెరికా ఎక్కువ లాభపడుతోంది. ఇప్పుడు అమెరికా సంగతి చూడాల్సిన సమయం ప్రపంచ దేశాలకు వచ్చింది. వారందరూ కలిసి డాలర్లను మెల్లగా వదిలించుకునే ప్రయత్నం చేస్తే.. చాలు మొత్తం అమెరికా అర్థికవ్యవస్థ కుప్పకూలిపోతుంది. డాలర్‌కు విలువ లేకుండా పోతుంది.
ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్
ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ ఉంది. ప్రపంచ దేశాల విదేశీ రిజర్వులలో 58 శాతం డాలర్, అంతర్జాతీయ వాణిజ్యంలో 54 శాతం ఎగుమతులు డాలర్లో లావాదేవీలు జరుగుతున్నాయి. దీని వల్ల “ఎక్సార్బిటెంట్ ప్రివిలేజ్” అమెరికాకు లభిస్తోంది. అంటే తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు తీసుకోవడం , ఆర్థిక ఆంక్షలు విధించే బలం ఉండటం చేస్తోంది. అందుకే ఇప్పుడు ఈ డాలర్ బంధం నుంచి బయటపడాలని ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
ఇప్పటికే ప్రత్యామ్నాయ కరెన్సీకి బలం
ఇప్పటికే ప్రపంచంలో అమెరికా డాలర్ ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్టు సూచనలు ఉన్నాయి, 2025లో, డాలర్ విలువ 10 శాతం కంటే ఎక్కువ తగ్గడం, ట్రంప్ పాలసీలు , డి డాలరైజేష ట్రెండ్లు ఈ తగ్గుదలను వేగవంతం చేస్తున్నాయి. BRICS దేశాలు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా ఇతర ఎమర్జింగ్ మార్కెట్లు డాలర్ ఆధారిత వ్యవస్థ నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు మరితం వేగంగా ఈ చర్యలను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే ట్రంప్ బ్రిక్స్ పై ఆరోపణలు చేస్తున్నారు.
డాలర్ లావాదేవీలు తగ్గేకొద్దీ ఆర్థిక సంక్షోభంలోకి అమెరికా
డాలర్ లావాదేవీలను ప్రపంచ దేశాలు తగ్గించి..తమ సొంత వ్యవస్థలు, కరెన్సీల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవడం ప్రారంభిస్తే.. మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇప్పటికే ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి. 2025లో ట్రంప్ టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వృద్ధిని 1.4 శాతానికి తగ్గించాయి. ఫిస్కల్ డెఫిసిట్ 34 ట్రిలియన్ డాలర్ల చేరింది. విదేశీ ఇన్వెస్టర్లు డాలర్లపై పెట్టుబడి తగ్గించారు. ఇది డాలర్ ఇండెక్స్‌ను 10.8 శాతం తగ్గించింది. 1973 తర్వాత అతి తక్కువ స్థాయి. BRICS దేశాలు డాలర్ బదులు రూపాయి, యువాన్ మారకంతో వాణిజ్యం చేయడానికి మారాయి. భారత్ BRICSతో రూపాయిలో వాణిజ్యం ప్రారంభించింది, రష్యా-చైనా వాణిజ్యంలో డాలర్ షేర్ 50 శాతం కంటే తక్కువ. ఇది ఆయిల్, కోల్ వంటి కమోడిటీలలో డాలర్ లావాదేవీలు తగ్గుతున్నాయి.
కొంత ఆలస్యమైనా అమెరికా కుప్పకూలిపోవడం ఖాయం !
డాలర్ ప్రపంచకరెన్సీగా మారి పూర్తి పట్టుసాధించింది. ఇప్పటికిప్పుడు అందరూ ప్రత్యామ్నాయం చూసుకోలేకపోవచ్చు కానీ.. మెల్లగా మారుతోంది. అంటే.. అమెరికాకు తిరిగి వెళ్లే డాలర్ల సంఖ్య పెరుగుతోంది. అదే అమెరికా నుంచి బయటకు వచ్చే డాలర్ల సంఖ్యతగ్గుతోంది.ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థును క్రమంగా చిన్నాభిన్నం చేస్తుంది . 2030 తర్వాత అమెరికా పరిస్థితి, డాలర్ పరిస్థితి ఊహించడం చాలా కష్టం. ఈ ఘనత సాధించబోయేది ట్రంపే.