అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ నేషనల్ కన్వెన్షన్

“మానవ సేవయే మాధవ సేవ” అనే సిద్ధాంతాన్ని నమ్మి ఆప్త (అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) సంస్థ ను 2008 సంవత్సరము లో స్థాపించి ఇప్పటికి ఒక దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భములో ఆప్త సంస్థ మొట్ట మొదటి సారిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిన్చ తగినట్లుగా ఆప్త నేషనల్ కన్వెన్షన్ ఈ 2018 సంవత్సరం ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 2 వరకు 3 రోజుల పాటు 10 వ వార్షికోత్సవాన్ని అమెరికా లోని మేరీల్యాండ్ రాష్ట్రములోని బాల్టీమోర్ పట్టణము నడిబొడ్డులో ఉన్న జోసెఫ్ మెయిర్హోఫ్ సింఫనీ హాల్ నందు ఘనం గా నిర్వహించడమైనది.

ఈ ఆప్త నేషనల్ కన్వెన్షన్ కొరకు భారీ ఏర్పాట్లు చెయ్యటం జరిగినది. ఈ జాతీయ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుండి ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని విచ్చేసిన 4000 మంది తెలుగు వారు అందరికి ఆప్త కన్వెన్షన్ టీం తరుపున ఆప్త బోర్డు చైర్ శ్రీమతి రాధిక నైగాపుల, ఆప్త ప్రెసిడెంట్ శ్రీ గోపాల గూడపాటి, ఆప్త కన్వెన్షన్ 2018 కన్వీనర్ శ్రీ ధీరజ్ ఆకుల, కో కన్వీనర్స్ శ్రీ నటరాజు ఇల్లూరి, శ్రీ రెడ్డియ్య ప్రత్తిపాటి, శ్రీనివాస్ సిద్ధినేని, శ్రీమతి లలిత బైరా, ఆప్త ఫౌండర్స్ శ్రీ ప్రసాద్ సమ్మెట, శ్రీ శ్రీనివాస్ చందు, శ్రీ శ్రీనివాస్ చిమట మరియు కన్వెన్షన్ కమిటీ సెక్రటరీ శ్రీ ఆనంద్ జవ్వాజి, సభ్యులు శ్రీ వీరబాబు ప్రత్తిపాటి, శ్రీ రాజ్ సిరిగిరి, శ్రీ శివ యర్రంశెట్టి, శ్రీ మధు దాసరి, శ్రీ రవీంద్రనాథ్ కొట్టే, శ్రీ రవి ముళ్ళపూడి, శ్రీ కిషోర్ ముత్యాల, శ్రీ రాజేష్ అంకం, శ్రీ ప్రవీణ్ అండపల్లి, బోర్డు సెక్రటరీ శ్రీ శివ కొప్పరాతి, జనరల్ సెక్రటరీ శ్రీ శౌరి ప్రసాద్ కొచ్చెర్ల, ఇతర కన్వెన్షన్ కమిటీ సభ్యుల శుభాభినందనలు.

శ్రీ శ్రీనివాస కళ్యాణము తో మొదలైన కన్వెన్షన్ దిగ్విజయముగా రెండు రోజులు సాగినది. పెద్దలు మరియు పిన్నలు యొక్క సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. SVR శత జయంతి ఉత్సవాలు ఆప్త కన్వెన్షన్ వేదిక పైన మొట్ట మొదటి సారిగా అమెరికా లో రంగ రంగ వైభవముగా జరిగినవి. ఈ సందర్భముగా SVR సిల్వర్ కాయిన్ ని ఆప్త వేదిక పైన ఆవిష్కరించి, SVR విగ్రహావిష్కరణ మరియు అనంత శ్రీరామ్ రచించిన అద్భుతమైన SVR గారి పైన పాటను, ఆప్తవాణి సౌవెనీర్ పుస్తకాన్ని ఆవిష్కరించడమైనది.

శ్రీ సుబ్బు కోట గారికి ఆప్త లైఫ్టైమ్ అచివ్మెంట్ అవార్డు ని ప్రధానము చెయ్యటం జరిగినది. మేరీల్యాండ్ సెక్రటరీ అఫ్ స్టేట్ శ్రీ. జాన్ సి. వబెన్స్మిత్ శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు ఆప్త అవార్డు ని శ్రీ అల్లు అరవింద్ గారికి ప్రధానం చేసి ఘనముగా సత్కరించడమైనది.

ఆప్త శ్రీ దాసరి అరుణ్ కుమార్, శ్రీ రవణం స్వామి నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ తులసి రామచంద్ర ప్రభు, ప్రముఖ సాహితి వేత్త శ్రీ యర్రంశెట్టి సాయి, ప్రముఖ గాయకుడు శ్రీ జి ఆనంద్, ప్రముఖ TT ప్లేయర్ శ్రీ ఉమేష్ ఆచంట లను ఘనముగా ఆప్త వేదిక పైన సత్కరించడమైనది. రుచికరమైన తెలుగింటి విందు భోజనాలు ఆహూతులకు వడ్డించడమైనది.

ఆప్తా పది వసంతాలు పూర్తి చేసుకున్న మైలురాయి సందర్భం గా జరిగిన ప్రపంచ మహాసభలను విజయవంతం చెయ్యటానికి ప్రముఖ రాజకీయ నేతలు శ్రీ పల్లం రాజు గారు, శ్రీ కన్నా లక్ష్మి నారాయణ గారు, శ్రీ బొత్సా సత్యనారాయణ గారు, శ్రీ సి రామచంద్రయ్య గారు, శ్రీ కదిరి బాబు రావు గారు,శ్రీ పి విజయ బాబు గారు, శ్రీ రత్నం ముత్యాల గారు, శ్రీ కృష్ణ రావు ముత్తంశెట్టి గారు, శ్రీ దిలీప్ బైరా గారు, శ్రీ రత్నాకర్ పండుగాయల గారు, శ్రీ సామినేని ఉదయ భాను గారు, శ్రీ వేణు గోపాల రావు గారు విచ్చేసారు.

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ నైట్, ఫ్లూట్ నాగరాజు పెర్ఫార్మెన్స్, కౌశిక్ బాబు అభినయం, శ్రుతకీర్తి నాట్యం, విభా ఫ్యాషన్స్ అధినేత్రి శ్రీమతి వినయ గోపిశెట్టి ఆధ్వర్యములో శ్రీమతి సంధ్య బయిరెడ్డి కోరియోగ్రఫీ లో ఫాషన్ షోస్ మరియు పిన్నలు, పెద్దలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంత గానో అలరించాయి.

Press release by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]