తమిళనాడులో అన్నీ డర్టీ పార్టీలే! అమిత్ షా

“దేశంలోకెల్లా అత్యంత అవినీతి పార్టీలు రెండే రెండు. 1. అన్నాడిఎంకె. 2. డిఎంకె. వాటితో పొత్తులు పెట్టుకొన్న పార్టీలు కూడా అవినీతిలో కూరుకుపోయున్నవే. ఆ రెండు అవినీతి పార్టీలే ఇంతకాలం తమిళనాడుని పరిపాలిస్తునందున రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిపోయింది. ఆ రెండు పార్టీల కారణంగానే తమిళనాడులో అవినీతి పేరుకుపోయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడిఎంకె ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పధకాల అమలు చేయడానికి కూడా ఇష్టపడకపోవడం వలన ఉదయ, ఉజ్వల వంటి అనేక పధకాల ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలు పొందలేకపోతున్నారు. అవినీతికి మారుపేరయిన ఆ రెండు పార్టీలు ప్రజలకు మాయమాటలు చెప్పి మళ్ళీ ఏదో విధంగా అధికారం దక్కించుకోవడానికి వస్తున్నాయి. కనుక రాష్ట్రంలో మళ్ళీ అవినీతి పార్టీల పాలనే కావాలో లేకపోతే ఆదర్శవంతమయిన మా పార్టీ పాలనే కావాలో రాష్ట్ర ప్రజలే నిర్ణయించుకోవాలి. ఆ అవినీతి పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఇదే మంచి అవకాశం కనుక ఈ ఎన్నికలలో ఆ రెంటినీ ఓడించి మాకు అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాము.”

ఈ మాటలు అన్నది మరెవరో కాదు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. బుదవారం సాయంత్రం తిరుచ్చిలో జరుగబోయే బహిరంగ సభలో పాల్గొనేందుకు బయలుదేరుతూ మీడియాతో ఈ మాటలన్నారు.

ఇప్పుడు ఆయన ఏ అన్నాడిఎంకె పార్టీని అవినీతి పార్టీగా అభివర్ణిస్తున్నారో అదే పార్టీ అధినేత్రి జయలలితని ఏదోవిధంగా ప్రసన్నం చేసుకొని ఆ పార్టీతోనే ఎన్నికల పొత్తులు పెట్టుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడి విశ్వప్రయత్నాలు చేసిన సంగతి అందరికీ తెలుసు. అన్నాడిఎంకె పార్టీతో పొత్తులు కుదిరిపోతాయనే నమ్మకంతో డిఎంకె పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి భాజపా అయిష్టత చూపడంతో అదే అదునుగా కాంగ్రెస్ పార్టీ దానితో పొత్తులు కుదుర్చేసుకొంది లేకుంటే నేడు అదే అవినీతి (డిఎంకె) పార్టీతో భాజపా అంటకాగుతూ కనిపించేది.

రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు భాజపా మొహం మీదనే తలుపులు వేయడంతో గత్యంతరం లేక చివరికి కెప్టెన్ విజయ్ కాంత్ నేతృత్వంలోని డిఎండికె పార్టీతో పొత్తులకి భాజపా సిద్దమయిపోయింది. కానీ ఆయన కూడా భాజపాకి ‘నో ఎంట్రీ బోర్డు’ చూపించడం తీవ్ర నిరాశకు గురయింది. అందుకే ఇప్పుడు తమిళనాట ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా అవినీతి పార్టీలుగా అమిత్ షా ముద్ర వేసేసి, ఒక్క తమ పార్టీ మాత్రమే చాలా నీతివంతమయిందని గొప్పగా చెప్పుకొంటున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగుతూ తనను ఎవరూ చూడటం లేదనుకొన్నట్లుగానే అమిత్ షా కూడా అంతకు ముందు అదే అవినీతి పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని తమ ప్రయత్నాలను ప్రజలు గమనించలేదని భావిస్తున్నట్లున్నారు. తమిళనాట ఉన్నవన్నీ అవినీతి పార్టీలే అనుకొన్నా భాజపా ఏమయినా గొప్ప నీతివంతమయినదా? అంటే దానికి కాదనే సమాధానం వస్తుంది.

అవినీతికి మారుపేరుగా చెప్పుకోబడే ఎడ్యూరప్పని కర్ణాటక రాష్ట్ర భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ మధ్యనే నియమించుకొంది. బ్యాంకులకి రూ.9,000 కోట్లు నామం పెట్టేసి విజయ్ మాల్యా లండన్ పారిపోతుంటే చూసి చూడనట్లు ఊరుకొంది. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి వేసింది. తమిళనాడుకి పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్, మెట్రో రైల్ ప్రాజెక్టులు వంటివన్నీ మంజూరు చేస్తానని హ్యండిచ్చింది. మరి తమిళనాడులోని ఆ పార్టీల కంటే భాజపా ఏవిషయంలో గొప్ప? అందరికంటే నీతి నిజాయితీ ఉన్న పార్టీ అని ఏవిధంగా చెప్పుకొంటోంది?

నిజానికి దక్షిణాది రాష్ట్రాలలో అన్నటికంటే తమిళనాడు రాష్ట్రం అన్ని రంగాలలో చాలా అభివృద్ధి సాధించింది. అన్నాడిఎంకె ప్రభుత్వం కేంద్రం అందించే సహాయసహకారాలు స్వీకరించడానికి ఇష్టపడటం లేదని అమిత్ షా స్వయంగా చెప్పారు. అంటే కేంద్రం సహాయం లేకుండానే జయలలిత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొన్నారనే విషయం ఆయనే స్వయంగా ద్రువీకరిస్తున్నట్లు భావించవచ్చును. మరి అటువంటప్పుడు ప్రజలు భాజపాకి ఎందుకు ఓట్లు వేస్తారు? అని అలోచిస్తే భాజపా తలక్రిందులుగా తపస్సు చేసినా కూడా ఈ ఎన్నికలలో గెలిచే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. అయినా ప్రయత్నలోపం ఉండకూడదనే ఉద్దేశ్యంతో అమిత్ షా ఏవో నీతి పాఠాలు వాళ్ళే వేస్తున్నారని సరిపెట్టుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆది.. పాన్ ఇండియా సినిమా

సాయికుమార్ త‌న‌యుడిగా ఇండ్ర‌స్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆది. ప్రేమ కావాలి, లవ్లీ సినిమాల‌తో మంచి విజ‌యాలు ద‌క్కాయి. ఆ త‌ర‌వాతే ట్రాక్ త‌ప్పాడు. ప్ర‌తిభ ఉన్నా, అవ‌కాశాలు వ‌స్తున్నా స‌ద్వినియోగం చేసుకోవ‌డం లేదు. ఇప్పుడు...

దేవ‌ర‌కొండ‌.. మిడ‌ల్ క్లాస్ మెలోడీస్!

దొర‌సానితో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు కావ‌డం, రాజ‌శేఖ‌ర్ కుమార్తె హీరోయిన్ గా ప‌రిచ‌యం అవ్వ‌డంతో ఈ ప్రాజెక్టుపై ఆశ‌లు, అంచ‌నాలు పెరిగాయి. కానీ ఆ సినిమా...

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్…!

శరవేగంగా జరుగుతున్న తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు బ్రేక్ వేసింది. సోమవారం వరకూ కూల్చివేతలు ఆపాలని.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతలు నిలిపివేయాలంటూ.. చిక్కుడు ప్రభాకర్ అనే వ్యక్తి దాఖలు...

క‌రోనా టైమ్ లోనూ… క‌నిక‌రించ‌డం లేదు!

క‌రోనా క‌ష్టాలు చిత్ర‌సీమ‌కు కుదిపేస్తున్నాయి. సినిమా రంగం ఈ ఉప‌ద్ర‌వం నుంచి ఇప్ప‌ట్లో బ‌య‌ట‌ప‌డ‌డం క‌ష్ట‌మే. చేయ‌గ‌లిగింది ఏమైనా ఉంటే, అది న‌ష్టాల్ని త‌గ్గించుకోవ‌డ‌మే. అందుకే కాస్ట్ కటింగ్‌, బ‌డ్జెట్ కంట్రోల్ అనే...

HOT NEWS

[X] Close
[X] Close