మాయావతికి సుప్రీం షాక్…కేంద్రం మద్దతు?

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి సుప్రీం కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో సిబీఐ చేత ఆమెపై కొత్తగా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి పునర్విచారణ చేయించాలని కోరుతూ వేయబడిన పిటిషన్ని సుప్రీం కోర్టు ఈరోజు విచారణకు స్వీకరించింది. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగుల డిఏ విషయంలో అవినీతికి పాల్పడ్డారని, తాజ్ కారిడార్ వ్యవహారంలో ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించి ఉన్న ఆమె ఆస్తులు, దానిపై కొన్నేళ్ళ క్రితం సిబీఐ దర్యాప్తు చేసి సమర్పించిన రికార్డుల ఆధారంగా మాయావతిపై కొత్తగా మరో ఎఫ్.ఐ.ఆర్.నమోదు చేసి సిబీఐ చేత పునర్విచారణ చేయించాలని పిటిషనర్ కోరారు. ఆ అభ్యర్ధనను సుప్రీం కోర్టు మన్నించి విచారణకు స్వీకరించింది. క్రిందటి నెలలోనే ఆమెపై ఆ డి.ఏ. కేసు విచారణ మొదలయింది. ఆ కేసును సుప్రీం కోర్టు రేపు విచారణకు చేపట్టబోతోంది.

ఇదివరకు యూపియే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆమె పార్టీ మద్దతు పొందేందుకు ఆమెపై సిబీఐని ప్రయోగించి తాజ్ కారిడార్ అవినీతి భాగోతం వెలికి తీయించింది. ఆ కేసు భయంతోనే మాయావతి యూపియే ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తూ వచ్చింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. కనుక ఆ ఎన్నికలలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బి.ఎస్.పి.తో పొత్తులు పెట్టుకోవాలని భాజపా ప్రయత్నిస్తోంది. బహుశః అందుకే ఆమెకు వ్యతిరేకంగా సిబీఐ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ సుప్రీం కోర్టు తెలిపినట్లున్నారు. అయితే ఈ కేసును సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది కనుక ఒకవేళ మళ్ళీ ఆమెపై ఎఫ్.ఐ.ఆర్.నమోదు చేసి సిబీఐ చేత పునర్విచారణ చేయించాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించినట్లయితే దానిని పాటించకతప్పదు. వచ్చే ఏడాది జరుగబోయే శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఆమెను నిలువరించేందుకే ఆమె రాజకీయ ప్రత్యర్ధులు ఎవరో ఈ పిటిషన్ వేసి ఉండవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అంతర్జాలం లో “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ప్రారంభం

ఈ నెలలో అంతర్జాలం లో "తానా ప్రపంచ సాహిత్య వేదిక" ను ప్రారంభిస్తున్నామని తద్వారా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, పర్వ్యాప్తి లో తానా మరో ముందడుగు...

తెలంగాణ ఉద్యోగులకు సగం జీతాలే..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతమే ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రానికి ఆదాయం పెరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థికశాఖకు ఆదేశాలు...

“అద్దె మైకు” చాలించు అంటూ సొంత పార్టీ కార్యకర్తల వాయింపు

వైకాపా ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ ఈరోజు ఉదయం ఒక టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ- హైకోర్టు పై విమర్శలు చేసిన తమ పార్టీ నేతలు, అభిమానులు చాలా వరకు...

తనను వేరే ఆస్పత్రికి రిఫర్ చేయాలని డాక్టర్ సుధాకర్ లేఖ..!

విశాఖ మానసిక ఆస్పత్రిలో తనకు వాడుతున్న మందులపై అనుమానం వ్యక్తం చేస్తూ.. డాక్టర్ సుధాకర్... ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సంచలన లేఖ రాశారు. తనకు వాడుతున్న మెడిసిన్స్ వల్ల.. తనకు సైడ్ ఎఫెక్ట్స్...

HOT NEWS

[X] Close
[X] Close