మధ్యప్రదేశ్ లా ప్రయత్నించండి.. కమలనాథులకు షా సూచన…!!

మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు ఎసరు పెట్టినట్లుగా తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ ను కూల్చేందుకు అవకాశం ఉందేమో చూడాలంటూ భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణ కమలనాథులకు సూచించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితిలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ వంటి నాయకులు కేసీఆర్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారిని ఆయుధంగా చేసుకుని కేసీఆర్ సర్కారును కూల్చే అవకాశం ఉందేమో పరిశీలించాలని బీజేపీ సుప్రీమ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నాయకులకు వర్తమానం పంపినట్లు పార్టీ వర్గాల సమాచారం. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింథియా ఆ సర్కారును దించేసినట్లుగానే తెలంగాణలో కూడా అవకాశం ఉందేమో చూడాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేంద్ర తో సహా పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్న మాట ఉన్న మాట వాస్తవమేనని, వారు పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకుంటే ఎంత మంది మద్దతు పలుకుతారన్నది లెక్కలు వేయాలని అమిత్ షా సూచించినట్లు స్థానిక నాయకులు చెబుతున్నారు. అయితే ఇది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి అయితే ఆ పాచిక పారే వచ్చునన్నది స్థానిక కమలనాథుల ఆలోచన. కేటీఆర్ ముఖ్యమంత్రి కాగానే పార్టీలో అంతర్గత శత్రువులు ఎక్కువ అవుతారని, కేసీఆర్ కు అనుకూలమైన సీనియర్ నాయకులను, ప్రజా ప్రతినిధులను కేటీఆర్ పక్కన పెడతారన్నది తెలంగాణ కమలనాథుల అభిప్రాయం. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే పార్టీ చీలిపోవడం ఖాయమని, చీలిక వర్గానికి బీజేపీ మద్దతు ఇస్తే మంచిదని స్థానిక నాయకులు చెబుతున్నారు. అయితే తెలంగాణని కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి పార్టీ సుప్రీం అమిత్ షా పావులు కదుపుతూనే ఉంటారని బీజేపీ తెలంగాణ నాయకులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“దిశ” బిల్లు ఏపీ ప్రభుత్వం దగ్గరే ఉందట..!

దిశ చట్టాన్ని కేంద్రంతో ఆమోదింప చేసుకోవడం అనే మిషన్‌ను ఎంపీలకు సీఎం జగన్ ఇచ్చారు. వారు పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే ముందు జగన్‌తో జరిగిన భేటీలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తానించి.....

కృనాల్‌కు కరోనా… శ్రీలంకతో రెండో టీ ట్వంటీ వాయిదా..!

కాసేపట్లో ప్రారంభం కావాల్సిన శ్రీలంక-ఇండియా మధ్య రెండో టీ ట్వంటీ మ్యాచ్ అనూహ్యంగా వాయిదా పడింది. ఇండియా ఆటగాడు కృనాల్ పాండ్యాకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం పాజిటివ్ గా రావడంతో ...

జ‌గ‌న్ అప్పాయింట్ మెంట్ దొర‌క‌డం లేదా?

టికెట్ రేట్ల గొడ‌వ ఇంకా తేల‌లేదు. ఈలోగానే రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. తిమ్మ‌రుసు, ఇష్క్ చిత్రాలు ఈనెల 30న విడుద‌ల అవుతున్నాయి. లాక్ డౌన్ త‌ర‌వాత విడుద‌ల అవుతున్న తొలి చిత్రాలివి....

మీడియా వాచ్ : టీవీ9 యాంకర్లపై కేసులు..!

టీవీ9 యాంకర్లు రోడ్డున పడ్డారు. కేసులు పెట్టుకున్నారు. దీంతో టీవీ9 యజమాన్యం కూడా ఉలిక్కిపడింది. వారి గొడవ పూర్తిగా వ్యక్తిగతమని చానల్‌కు.. వారు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదని సోషల్ మీడియాలో ప్రకటించుకోవాల్సి...

HOT NEWS

[X] Close
[X] Close