కేసీఆర్ సారూ… ఏది తేల్చరు…!?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తెలంగాణ రాష్ట్ర సమితి అగ్ర నాయకుల్లో అసహనం పెరుగుతోంది. పదవుల పందారంతో సహా మిగిలిన అన్ని విషయాల్లోనూ సీఎం కేసీఆర్ తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ సీనియర్ నాయకులు వాపోతున్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అనుభవ రాహిత్యంతో పాటు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని ముందుగా అనుకున్నారు. గడచిన ఐదేళ్లలో పాలనాపరంగా రాటు దేలిన కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతగా ప్రభావం చూపించలేకపోతున్నారు అంటున్నారు. తెలంగాణలో రెండోసారి అధికారపగ్గాలు చేపట్టిన కేసీఆర్ గతంలో చూపించిన దూకుడు ప్రదర్శించే లేకపోతున్నారన్నది పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయంగా చెబుతున్నారు. కఠినంగా వ్యవహరించాల్సిన అంశాల్లో ఉదాసీనంగా ఉండటం, సత్వరమే నిర్ణయాలు తీసుకోవాల్సిన అంశాలు పట్టించుకోకపోవడం వంటివి చేస్తున్నారని పార్టీ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. పైకి గంభీరంగా ఉన్నట్టు మాట్లాడుతున్నా లోలోపల మాత్రం ఇంటి సెగ ఆయనను వేధిస్తోందని సీనియర్లు చెబుతున్నారు. తన కుమారుడు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును తన వారసుడిగా కేసీఆర్ ప్రకటించాలనుకున్నా దానికి సమయ సందర్భాలు ఉన్నాయని కేసీఆరే సీనియర్ల వద్ద చాలాసార్లు చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించాలంటూ ఇంటిపోరు ఎక్కువైంది అంటున్నారు. లోక్ సభ ఎన్నికలలో కుమార్తె కల్వకుంట్ల కవిత ఓడిపోవడం కూడా కేసీఆర్ కు తలనొప్పులు తెచ్చి పెడుతోందని సమాచారం. ఎన్నికల్లో ఓటమి చవి చూసిన కుమార్తె కల్వకుంట్ల కవితకు సముచిత స్థానం కట్ట పెట్టాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. దీంతో కేసీఆర్ కుమారుడు, ఇటు కుమార్తెల మధ్య కేసీఆర్ నలిగిపోతున్నారని పార్టీ నాయకులు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close