విజయసాయిరెడ్డి కోరిక తీర్చిన అమిత్ షా..!

హైదరాబాద్ సీబీఐ జాయింట్ డైరక్టర్‌గా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారిని నియమించవద్దంటూ.. విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తిని హోంమంత్రి అమిత్ షా మన్నించారు. హైదరాబాద్ సీబీఐ జేడీగా.. గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధరన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మనోజ్ శశిధరన్.. కేరళకు చెందిన వ్యక్తి. ఐపీఎస్‌గా గుజరాత్ కేడర్‌లో సుదీర్ఘంగా పని చేస్తున్నారు. అమిత్ షా, నరేంద్రమోడీలకు అత్యంత సన్నిహిత అధికారిగా పేరు పొందారు. గుజరాత్ నుంచి నేరుగా ఆయన హైదరాబాద్ సీబీఐ జేడీగా వస్తున్నారు. ఐదేళ్ల పాటు జేడీగా ఉంటారు.

సీబీఐ జేడీగా.. హెచ్.వెంకటేష్ అనే అధికారి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ.. కొద్ది రోజుల కిందట.. విజయసాయిరెడ్డి.. అమిత్ షాకు లేఖ రాశారు. అందులో.. హెచ్.వెంకటేష్ అనే అధికారి.. చంద్రబాబు ఏం చెబితే అది చేస్తారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ అధికారి.. గతంలో ఎస్పీగా ఉన్నప్పుడు.. జగన్ అక్రమాస్తుల కేసును విచారించారు. ఈ కారణంగానే.. విజయసాయిరెడ్డి మళ్లీ ఆ అధికారి జేడీగా రాకూడదని కోరుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు.. ఎంపీ హోదాలో అమిత్ షాకు లేఖ రాసిన.. విజయసాయిరెడ్డి ఆ మేరకు సానుకూల ఫలితం పొందారు. కానీ.. పదకొండు సీబీఐ కేసుల్లో ఏ-2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి.. రాసిన లేఖకు.. అమిత్ షా స్పందించడం.. చాలా మందిని ఆశ్చర్య పరిచింది.

ఇప్పుడు.. విజయసాయి రెడ్డి కోరికను మన్నిస్తూ.. తెలుగు రాష్ట్రాలకు చెందని అధికారిని నియమించారు. అయితే అమిత్ షా నేరుగా.. తనకు సన్నిహితుడైన అధికారినే.. హైదరాబాద్ లో నియమించారు. అంటే.. కేసులు ఎలాంటి మలుపు తిరగాలన్నా.. అది.. ఖచ్చితంగా… సీబీఐ జేడీ చేతుల్లోనే ఉంటుందన్నది ఖాయం. ఈ నియామకం విజయసాయిరెడ్డిని సంతృప్తి పరిచిందో లేదో.. ఆయన స్పందనను బట్టే తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : ఓనర్లు కాదు.. వాళ్లే టీవీ5ని అమ్మేశారు..!

ప్రముఖ మీడియా సంస్థ టీవీ5 అమ్మేశారని కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఒక్క సారిగా ఓ పార్టీ వాళ్లు ప్రచారం ప్రారంభించేశారు. దీంతో తెలుగు మీడియాలో అందరూ ఉలిక్కిపడ్డారు. నిజమా అని చెక్...

సాగర్‌కు ఓకే కానీ సీమకు కృష్ణా నీళ్లు పంపొద్దంటున్న తెలంగాణ..!

శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతున్నా .. రాయలసీమకు నీరు విడుదల చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లడంతో ఇప్పుడు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది....

టీ బీజేపీ నుంచి పోయేవాళ్లను ఎవరూ ఆపడం లేదేంటి..!?

తెలంగాణ బీజేపీకి వలసల ఫీవర్ పట్టుకుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటూ అంచనాలు రావడంతో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు బీజేపీ బాట పట్టారు....

మండలి రద్దు తీర్మానాన్ని ఇంకా పరిశీలిస్తున్నారట..!

శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం పరిశీలనలో ఉందని.. కేంద్ర మంత్రి రిజుజు రాజ్యసభలో తెలిపారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. లిఖితపూర్వక సమాధానం...

HOT NEWS

[X] Close
[X] Close