పర్‌ఫెక్ట్ టీమ్ షో..! రెండో వన్డే కోహ్లీసేనదే..!

తొలి వన్డే పరాజయానికి టీమిండియా బదులు తీర్చుకుంది. రెండో వన్డేలో ఘన విజయం సాధించింది. రెండో వన్డేలో టీమిండియా జాగ్రత్త పడింది. భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచినప్పటికీ ఎక్కడా ఉదాసీనతకు తావివ్వకుండా.. ఘన విజయాన్ని సాధించింది. రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో.. టీమిండియా ఆటగాళ్లు ఆల్ రౌండ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ధావన్, కోహ్లీ, కేఎల్ రాహుల్ ఒకరి తర్వాత ఒకరు బ్యాట్ ఝుళిపించారు. ఓపెనర్ రోహిత్ శర్మ కూడా.. మెరుపులు మెరిపించారు. రోహిత్ శర్మ.. అత్యంత వేగంగా వన్డేలో ఏడు వేల పరుగులు చేసిన ప్రపంచరికార్డును కూడా ఈ మ్యాచ్‌తో అధిగమించారు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ నాలుగు పరుగుల తేడాతో సంచరీని కోల్పోయారు.

కోహ్లీ 78, రాహుల్ 80 పరుగులు చేసి.. భారత్ స్కోరును 340కి చేర్చారు. 341 పరుగుల లక్ష్యం.. భారీదే అయినప్పటికీ.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌తో పోలిస్తే చిన్నదే. మొదటి వన్డేలో వికెట్ నష్టపోకుండా.. వార్నర్, ఫించ్ కొట్టిన గెలుపు టీమిండియా మర్చిపోయే పరిస్థితి లేదు. వార్నర్ , ఫించ్, స్మిత్, లబూషన్ వంటి బ్యాటింగ్ మాస్టర్లతో నిండిపోయిన ఆస్ట్రేలియా లైనప్ .. కొట్టేస్తుందని అనుకున్నారు. కానీ టీమిండియా అటు బౌలింగ్ లో ఇటు ఫీల్డింగ్ లోనూ పట్టుదల ప్రదర్శించారు.

తొలి వన్డేలో రచ్చ చేసిన వార్నర్, ఫించ్.. ఈ సారి 20 పరుగుల వద్దే విడిపోయారు. తర్వాత స్మిత్ తప్ప ఏ ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ నిలకడ చూపించలేకపోయారు. స్మిత్ 98 పరుగులు చేసి ఔటయ్యారు. షమీ మూడు వికెట్లు తీయగా.. సైని, జడేజా, కుల్దీప్ రెండేసి వికెట్లు పడగొట్టారు. బుమ్రా ఒక్క వికెట్ తో సరి పెట్టుకున్నారు. ఈ గెలుపుతో సిరీస్ 1-1తో సమం చేసింది టీమిండియా. మూడో వన్డేలో గెలిచిన వారే.. సిరీస్ విన్నర్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: నిశ్శ‌బ్దం

తెలుగు360 రేటింగ్ 2/5 పొడుపు క‌థ వేయ‌డంలో కాదు. దాన్ని విప్ప‌డంలో అంత‌కంటే ఎక్కువ మ‌జా ఉంటుంది. థ్రిల్ల‌ర్ సినిమాలూ అంతే. అందులో చిక్కుముడులు కాదు. దాన్ని విప్పే విధానం ముఖ్యం. థ్రిల్ల‌ర్...

రివ్యూ: ఒరేయ్‌.. బుజ్జిగా

తెలుగు360 రేటింగ్ 2.25/5 క‌న్‌ఫ్యూజ్ డ్రామాలు భ‌లే బాగుంటాయి. దాంట్లోంచి బోలెడంత కామెడీ చేయొచ్చు. క‌థేమీ లేక‌పోయినా - ఆ గంద‌ర‌గోళంతోనే క‌థ న‌డిపేయొచ్చు. విజ‌య్ కుమార్ కొండా తీసిన `గుండె జారి...

తీరు మారకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తాం..! ఏపీ సర్కార్‌కు హైకోర్టు హెచ్చరిక..!

హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ అంశంపై జరిగిన విచారణలో రూల్‌ ఆఫ్‌ లా సరిగ్గా అమలు కాకుంటే...

హిమాన్షుకు గాయం..! అంతగా చర్చించుకున్నారేంటి..?

కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే...

HOT NEWS

[X] Close
[X] Close