జగన్ విన్నపాలకి అమిత్ షా రియాక్షనేంటి…?

సాధారణంగా హోంమంత్రి అమిత్ షా.. ముఖ్యమంత్రుల అపాయింట్‌మెంట్ ఉంటే.. ఆఫీస్ అవర్స్‌లోనే ఇస్తారు. కాస్త తీరుబడిగా సమస్యలపై చర్చిస్తారు. మామూలుగా రాత్రి పది తర్వాత పార్టీ నేతలకు కూడా అపాయింట్‌మెంట్లు ఇవ్వరని చెబుతారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. అమిత్ షా .. రాత్రి పది గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అరగంట సేపు మాట్లాడి పంపేశారు. పదే పదే అడుగుతున్నారు కదా.. అని… కాస్త సమయం చూసుకుని కలిసినట్లుగా..ఈ భేటీ జరిగిందనే అభిప్రాయం ఢిల్లీలో ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావాలని..జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. రెండు సార్లు ఢిల్లీ వెళ్లి తిరిగి వచ్చారు. ఓ సారి అపాయింట్‌మెంట్ ఖరారైనా..ఆ రోజు పుట్టిన రోజు.. శుభాకాంక్షలు చెప్పి రావడమే తప్ప..గోడు వినిపించలేకపోయారు.

అయితే హఠాత్తుగా..ఓ శుక్రవారం అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారైంది. రెండు రోజుల ముందు ప్రధాని మోడీని కూడా కలిశారు. మోడీకి ఇచ్చిన విజ్ఞాపనా పత్రాన్నే.. అమిత్ షాకు ఇచ్చారు. మోడీతో గంటన్నర సేపు మాట్లాడారని.. వైసీపీ ప్రకటించుకుంది. ఆయన ఇంట్లోకి వెళ్లినప్పటి నుండి బయటకు వచ్చే వరకూ.. ఈ లెక్క ఉంది. అయితే.. అమిత్ షా ఇంట్లోకి వెళ్లినప్పుటి నుండి.. బయటకు వచ్చేసరికి లెక్కలేసుకున్నా.. ఆ సమయం గంట కూడా లేదు. దీంతో.. జగన్మోహన్ రెడ్డి తాను చెప్పాలనుకున్నదాన్ని చెప్పారో లేదోనన్న చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ప్రకారం… మూడు రాజధానుల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తే చాలు అనుకున్నారు.

ఆ మేరకు.. అటు మోడీ.. ఇటు అమిత్ షాలకు ఇచ్చిన లేఖల్లో దాన్ని ప్రస్తావించారు. దాంతో కేంద్రానికి అన్నీ చెప్పే చేస్తున్నామన్న తమ మాటలకు ఓ జస్టిఫికేషన్ తెచ్చుకున్నారు. వారి రియాక్షన్ ఏమిటో అన్నది మాత్రం బయటకు రాలేదు. బహుశా.. కేంద్రం తీసుకునే చర్యలు.. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలే… చర్యలుగా భావించాల్సి ఉంటుంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా అంత ఉత్సాహంగా కనిపించలేదని ఢిల్లీ మీడియా వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : ఓనర్లు కాదు.. వాళ్లే టీవీ5ని అమ్మేశారు..!

ప్రముఖ మీడియా సంస్థ టీవీ5 అమ్మేశారని కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఒక్క సారిగా ఓ పార్టీ వాళ్లు ప్రచారం ప్రారంభించేశారు. దీంతో తెలుగు మీడియాలో అందరూ ఉలిక్కిపడ్డారు. నిజమా అని చెక్...

సాగర్‌కు ఓకే కానీ సీమకు కృష్ణా నీళ్లు పంపొద్దంటున్న తెలంగాణ..!

శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతున్నా .. రాయలసీమకు నీరు విడుదల చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లడంతో ఇప్పుడు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది....

టీ బీజేపీ నుంచి పోయేవాళ్లను ఎవరూ ఆపడం లేదేంటి..!?

తెలంగాణ బీజేపీకి వలసల ఫీవర్ పట్టుకుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటూ అంచనాలు రావడంతో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు బీజేపీ బాట పట్టారు....

మండలి రద్దు తీర్మానాన్ని ఇంకా పరిశీలిస్తున్నారట..!

శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం పరిశీలనలో ఉందని.. కేంద్ర మంత్రి రిజుజు రాజ్యసభలో తెలిపారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. లిఖితపూర్వక సమాధానం...

HOT NEWS

[X] Close
[X] Close