ఎన్.ఆర్.సి.ని ప్ర‌చారాస్త్రంగా మారుస్తున్న అమిత్ షా!

జాతీయ పౌరుల జాబితా (ఎన్.ఆర్.సి.)ని దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేస్తామని భాజ‌పా చెబుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌డ‌చిన ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా ఎన్.ఆర్.సి. అంటూ హ‌డావుడి చేసి ల‌బ్ధి పొందేందుకు ప్ర‌య‌త్నించింది. తాజాగా బెంగాల్ రాష్ట్రంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మికి కార‌ణం ఈ అంశ‌మే అంటూ ఆ పార్టీ విశ్లేషించుకుంది. అయితే, దీన్ని దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేసి తీర‌తామ‌నీ, 2024 లోపు దేశంలో ఒక్క చొర‌బాటుదారుడు కూడా ఉండ‌టానికి వీల్లేద‌న్నారు. చొర‌బాటుదారుల్ని గుర్తించి వారి సొంత దేశాల‌కు పంపిస్తామ‌న్నారు. జార్ఖండ్ లో జ‌రిగిన ఎన్నికల ప్ర‌చారంలో అమిత్ షా ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న అక్క‌డే ఎందుకు చేశారంటే… అక్క‌డ అసెంబ్లీ ఎన్నిక‌లున్నాయి క‌దా!

చొర‌బాటు దారుల్ని ఏరివేయ‌డం మంచి నిర్ణ‌య‌మే, అయితే దీన్ని అమ‌లు చేస్తామ‌ని చేసే ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌తిప‌క్ష పార్టీ మీద ఆగ్ర‌హంతోనో, ఆ పార్టీకి చెందిన నాయ‌కుడి మీద విమ‌ర్శ‌ల‌తోనే ప్ర‌క‌టించాల్సిన ప‌నేముంది..? ఎన్.ఆర్.సి.ని దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేస్తున్నామంటూ… రాహుల్ గాంధీ మీద విమ‌ర్శ‌లు చేశారు అమిత్ షా! ఎన్.ఆర్.సి.ని రాహుల్ బాబా ఎందుకు వ‌ద్దంటున్నారు అని ప్ర‌శ్నించారు. చొర‌బాటుదారుల్ని పంపిస్తే ఎక్క‌డికి వెళ్తారు, ఏం తింటారు, ఏమౌతారంటూ రాహుల్ బాబా ఎందుకు ఆవేద‌న చెందుతున్నార‌న్నారు! ఎందుకు సోద‌రా… మీ తోడ‌బుట్టిన‌వాళ్లంతా ఆ జాబితాలో క‌నిపిస్తున్నారా, అయినాస‌రే… భాజ‌పా అంద‌ర్నీ ఏరి పంపేస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. ఈ సంద‌ర్భంగా అయోధ్య రామ మందిరం గురించి కూడా మాట్లాడారు. మందిరం నిర్మించాలా వ‌ద్దా చెప్పాంటూ ప్ర‌జ‌ల్ని ప్ర‌శ్నించారు.

నిజానికి, జార్ఖండ్ లో రైతుల స‌మ‌స్య‌లు, రుణ‌మాఫీని ప్ర‌ధాన ప్ర‌చారాస్త్రంగా రాహుల్ గాంధీ ప్ర‌చారం చేస్తున్నారు. తాము అధికారంలోకి వ‌చ్చిన రాష్ట్రాల్లో మొద‌టి నిర్ణ‌యంగా రుణ‌మాఫీ అమ‌ల్లోకి తెస్తున్నామంటున్నారు. గిరిజ‌నుల భూముల్ని లాక్కుని పారిశ్రామికవేత్త‌ల‌కు ఇచ్చేస్తున్నారంటూ ప్ర‌చారం చేస్తున్నారు. ఈ అంశాల‌కు అమిత్ షా స‌మాధానం ఇవ్వ‌డం లేదు. భాజ‌పా ప్ర‌చార అజెండాలో కూడా ఇలాంటివేవీ ప్ర‌స్తుతానికి క‌నిపించ‌డం లేదు. ఇవ‌న్నీ వ‌దిలేసి జాతీయాంశాలైన ఎన్.ఆర్.సి., రామ‌మందిరాల‌ను చ‌ర్చ‌కు పెడుతున్నారు. సాధార‌ణంగా అసెంబ్లీ ఎన్నిక‌లు అనేస‌రికి ఇలాంటి వాటికంటే ఆయా రాష్ట్రాల స‌మ‌స్య‌లు ప్ర‌ధానం అవుతాయి. కానీ, ఇక్క‌డ కూడా మ‌ళ్లీ జాతీయ‌త‌, హిందుత్వ లాంటి భావోద్వేగపూరిత అంశాల‌నే ప్ర‌చారంలోకి ప్ర‌ముఖంగా తెచ్చే ప్ర‌య‌త్నం అమిత్ షా చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close