అమిత్ షాకు పాజిటివ్.. అమితాబ్‌కు నెగెటివ్..!

కరోనా పాజిటివ్‌కు వీఐపీలు.. వీఐపీలు.. సామాన్యులు అనే తేడా లేదు. దేశంలో మోడీ తర్వాత అత్యంత పవర్ ఫుల్ అనుకునే అమిత్ షాను కూడా.. కరోనా వదిలి పెట్టలేదు. తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని.. అమిత్ షా స్వయంగా ట్వీట్ చేశారు. తనను కలవడానికి వచ్చిన వారందరూ… సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లాలని కోరారు. ప్రస్తుతానికి తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. అయితే వైద్యుల సలహాతో.. అమిత్ షా ఆస్పత్రిలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పరిమితంగానే అపాయింట్‌మెంట్లు ఇస్తూ ఉంటారు కానీ.. అమిత్ షా మాత్రం… అన్ని వ్యవహారాలు చక్క బెడుతూ ఉంటారు.

కరోనా వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయడానికి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. ఎక్కువ మందిని కలవడంతో.. ఎవరో ఒకరి నుంచి వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల అమిత్ షాకు స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో.. టెస్ట్ చేశారు. అందులో పాజిటివ్‌గా తేలింది. గతంలో.. అమిత్ షాకు.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండటంతో.. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో.. ఫుల్ అబ్జర్వేషన్ లో ఉంచేందుకు ఆస్పత్రిలో చేరాలని వైద్యులు సలహాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మరో వైపు ఇరవై రోజుల కిందట.. కరోనా పాజిటివ్‌గా తేలిన సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. కోలుకున్నారు. ఆయనకు నెగెటివ్ రావడంతో… నానావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ ప్రకటించారు. అభిషేక్‌కు కూడా.. పాజిటివ్ వచ్చింది. ఆయన కోలుకున్నారో లేదో చెప్పలేదు. అదే సమయంలో.. ఐశ్వర్యారాయ్, ఆరాధ్యకు కూడా పాజిటివ్ వచ్చింది. వారికి త్వరగానే కరోనా తగ్గిపోవడంతో…గత వారమే డిశ్చార్జ్ అయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“దిశ” బిల్లు ఏపీ ప్రభుత్వం దగ్గరే ఉందట..!

దిశ చట్టాన్ని కేంద్రంతో ఆమోదింప చేసుకోవడం అనే మిషన్‌ను ఎంపీలకు సీఎం జగన్ ఇచ్చారు. వారు పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే ముందు జగన్‌తో జరిగిన భేటీలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తానించి.....

కృనాల్‌కు కరోనా… శ్రీలంకతో రెండో టీ ట్వంటీ వాయిదా..!

కాసేపట్లో ప్రారంభం కావాల్సిన శ్రీలంక-ఇండియా మధ్య రెండో టీ ట్వంటీ మ్యాచ్ అనూహ్యంగా వాయిదా పడింది. ఇండియా ఆటగాడు కృనాల్ పాండ్యాకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం పాజిటివ్ గా రావడంతో ...

జ‌గ‌న్ అప్పాయింట్ మెంట్ దొర‌క‌డం లేదా?

టికెట్ రేట్ల గొడ‌వ ఇంకా తేల‌లేదు. ఈలోగానే రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. తిమ్మ‌రుసు, ఇష్క్ చిత్రాలు ఈనెల 30న విడుద‌ల అవుతున్నాయి. లాక్ డౌన్ త‌ర‌వాత విడుద‌ల అవుతున్న తొలి చిత్రాలివి....

మీడియా వాచ్ : టీవీ9 యాంకర్లపై కేసులు..!

టీవీ9 యాంకర్లు రోడ్డున పడ్డారు. కేసులు పెట్టుకున్నారు. దీంతో టీవీ9 యజమాన్యం కూడా ఉలిక్కిపడింది. వారి గొడవ పూర్తిగా వ్యక్తిగతమని చానల్‌కు.. వారు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదని సోషల్ మీడియాలో ప్రకటించుకోవాల్సి...

HOT NEWS

[X] Close
[X] Close