ఇంత జరిగినా జనసేన నేతలు చంద్రబాబే కారణం అంటున్నారు..!

జగన్మోహన్ రెడ్డి చట్టాలను.. రాజ్యాంగాలను పట్టించుకోకుండా.. అమరావతిని మార్చేసి.. మూడు రాజధానులు చేస్తున్నారని.. అంతా గగ్గోలు పెడుతూంటే… జనసేన నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ మాత్రం… చంద్రబాబు తప్పిదాల వల్లే.. జగన్ రాజధాని మారుస్తున్నారని కొత్త కోణం ఆవిష్కరిస్తున్నారు. అమరావతి రైతులకు ప్రస్తుత పరిస్థితి ఉత్పన్నం కావడానికి చంద్రబాబే కారణమని చెప్పుకొస్తున్నారు. రాజధాని అంశంలో భవిష్యత్తులో ఏదైనా సమస్య ఉత్పన్నమైతే.. రైతులకు ఎవరు భరోసాగా ఉంటారని 2015లోనే పవన్ బలంగా మాట్లాడారని నాగబాబు గుర్తు చేసి చెబుతున్నారు.

ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రైతులు భూములిచ్చారు.. ఇప్పుడు రాజధాని తీసుకెళ్లిపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుందన్నారు. ఈ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్‌కు పాల్పడుతున్న జగన్‌పై మాత్రం నాగబాబు విమర్శలు చేయడం లేదు. ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి ప్రధాన కారకులు చంద్రబాబేనని మళ్లీ ప్రతిపక్ష నేత వద్దకు వెల్తున్నారు. చంద్రబాబు తప్పిదాల వల్లే నేడు తనకు అనుకూలంగా మార్చుకుని.. జగన్ రాజధానిని తరలిస్తున్నారని సూత్రీకరించారు. అంటే తరలిస్తున్న జగన్‌ది తప్పే మీ కాదు కానీ.. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుది మాత్రం తప్పేనన్నమాట. నాదెండ్ల మనోహర్ కూడా… అలాంటి విమర్శలే చేస్తున్నారు.

రాజధాని తరలించేందుకు ఆస్కారం లేని చట్టం చేయడంలో.. చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పుకొచ్చారు. స్పీకర్‌గా పని చేసిన నాదెండ్ల అలాంటి చట్టం ఎలా ఉంటుందో.. కూడా చెప్పాల్సి ఉంది. మొత్తానికి జనసేన నేతలు.. జగన్ ను విమర్శించడానికి కూడా వెనుకాడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ చంద్రబాబునే నిందించి రాజకీయం చేద్దామనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ రాజధానిపై కేంద్రం తేల్చేసింది..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కేంద్రానికి సంబంధం లేదని.. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని... కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిదా.. రాష్ట్ర పరిధిలోనిదా...

రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ సెక్యూరిటీ..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర బలగాలు రక్షణ కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు వై కేటగిరి సెక్యూరిటీ కల్పించినట్లుగా సమాచారం అందిందని.. అధికారిక ఆదేశాలు ఒకటి రెండు రోజుల్లో వస్తాయని రఘురామకృష్ణరాజు మీడియాకు...

దళిత నేతలతోనే న్యాయస్థానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు..! వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?

వైసీపీ రాజకీయ వ్యూహం.. న్యాయవ్యవస్థపై సామాజిక పద్దతుల్లో అమలు చేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని... దళితుల్ని అడ్డు పెట్టుకుని.. న్యాయవ్యవస్థపై విమర్శలు చేసి.. ఒత్తిడి పెంచే...

రామాలయ భూమిపూజ లైవ్ ఇవ్వని ఎస్వీబీసీ..! బీజేపీ విమర్శలు..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ చూసేలా.. ఏర్పాట్లు చేశారు. చివరికి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లోనూ... ప్రసారం చేశారు. అయితే.. అనూహ్యంగా... తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి...

HOT NEWS

[X] Close
[X] Close