‘మితృత్వ పోటీ’ ఇమేజ్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌ల‌రా..?

తెలంగాణ‌లో ఇంత‌వ‌ర‌కూ తెరాస వెర్సెస్ మ‌హాకూట‌మి అన్న‌ట్టుగానే ఎన్నిక‌ల పోరాటం ఉంటుంద‌నే వాతావ‌ర‌ణం ఉంది. అయితే, తాము కూడా గ‌ట్టి పోటీదారుల‌మే అని నిరూపించుకునే క్ర‌మంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా క‌స‌ర‌త్తు ప్రారంభించింది. దాన్లో భాగంగానే ప‌రిపూర్ణానంద‌ను ప్ర‌చారంలోకి దించాల‌ని భావించ‌డం. దీంతోపాటు, తెలంగాణ‌లో స్టార్ కేంపెయిన‌ర్ గా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వ‌రుస‌గా బ‌హిరంగ స‌భ‌లు, ప‌ర్య‌ట‌న‌లు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్ర‌ధాన పార్టీల‌తో ధీటుగా తామూ ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నామ‌ని చాటి చెప్ప‌డం కోసం ఏకంగా 15 మంది ముఖ్య‌మంత్రులు, 100 మంది ఎంపీల‌ను ప్ర‌చారంలోకి దింపుతామ‌ని అమిత్ షా అంటున్నారు. ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన కొంత‌మంది నేత‌లు ఇప్ప‌టికే హైద‌రాబాద్ చేరుకున్న‌ట్టు స‌మాచారం. అయితే, ఈ ప్ర‌చారంలో మొద‌టి ల‌క్ష్యం… తెరాస‌తో త‌మ‌కు ర‌హ‌స్య మితృత్వం లేద‌ని తెలంగాణ‌లో చాటి చెప్పుకోవ‌డం!

ఆ మ‌ధ్య అమిత్ షా రాష్ట్రానికి వ‌చ్చిన‌ప్పుడు కేసీఆర్ మీద బాగానే విమ‌ర్శ‌లు చేశారు. ఇక‌పై వ‌రుస‌గా స‌భ‌లూ స‌మావేశాలూ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు పెట్టి.. కేసీఆర్ స‌ర్కారు వైఫ‌ల్యాలను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నార‌ట‌! నిజానికి, తెరాస మితృత్వ ఇమేజ్ నుంచి బ‌య‌ట‌ప‌డితే త‌ప్ప‌… తెలంగాణ‌లో కొంతైనా భాజ‌పాకి ప్రాధాన్య‌త ద‌క్క‌దు అనేది వాస్త‌వం! అయితే, ఈ ఇమేజ్ నుంచి బ‌య‌ట‌ప‌డాలని భాజ‌పా బలంగా అనుకున్నా… సాధ్యం కాని స్థాయిలో ఒక ర‌క‌మైన రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని కేసీఆర్ సెట్ చేసేశారు అన‌డంలో సందేహం లేదు!

మోడీ స‌ర్కారు తీసుకుంటున్న నిర్ణ‌యాలను దేశ‌మంతా వ్య‌తిరేకిస్తున్నా మెచ్చుకున్న‌వారిలో కేసీఆర్ నిలిచారు. ఆ త‌రువాత‌, ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ అంటూ కేసీఆర్ జాతీయ రాజ‌కీయ వేదిక అని హ‌డావుడి చేసినా… అది లోప‌యికారీగా మోడీకి మేలు చేసే వేదిక అనే ఇమేజే తెచ్చుకుంది! ఇక‌, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌య్యాక‌… ఆ ఫ్రెంట్ ఆలోచ‌న‌ల్ని కేసీఆర్ వ‌దిలేశారు. కాంగ్రెసేత‌రం, భాజ‌పాయేతరం అనే సిద్ధాంతాన్ని సుప్త‌చేత‌నావ‌స్థ‌లోకి నెట్టేశారు. ఇది కూడా భాజ‌పా అనుకూల చ‌ర్య‌గానే విశ్లేషించుకోవాల్సిన ప‌రిస్థితి. ఇక‌, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు కేసీఆర్ సిద్ధ‌ం కాగానే… మోడీ స‌ర్కారు అన్ని విధాలుగా సాయం చేసింద‌నే అభిప్రాయ‌మూ బ‌లంగానే ఉంది! ఇలా భాజ‌పా, తెరాస‌ల మ‌ధ్య ర‌హ‌స్య స్నేహం ఉంద‌ని బ‌లంగా ప్ర‌జ‌లు న‌మ్మ‌డానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు వీట‌న్నింటినీ కాద‌ని.. తెరాస‌పై వ్య‌తిరేకంగా భాజ‌పా పోరాడుతోంద‌ని తెలంగాణ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించాలంటే.. భాజ‌పాకి క‌త్తి మీద సామే! ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు వ‌చ్చినా, ఎంతమంది ఎంపీలు రంగంలోకి దిగినా… అవ‌న్నీ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం లేని ముఖాలే త‌ప్ప‌, తెరాస‌కు ధీటుగా భాజ‌పా సిద్ధ‌మౌతున్న క్ర‌మాన్ని ఎలా చాటి చెప్ప‌గ‌ల‌రు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close