మహాకూటమి ఉంటుందా..? ఊడుతుందా..? కోదండరాం 48 గంటల డెడ్ లైన్..!!

తెలంగాణ మహాకూటమికి పెద్దన్నగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించాల్సిన తీరు.. ఇతర పార్టీలను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. సీట్ల గురించి ఏ మాత్రం చెప్పకుండా.. తన మానాన తను పని చేసుకుంటూ పోతోంది కాంగ్రెస్ పార్టీ. మొదట అన్ని పార్టీలనూ.. కలసి రావాలని… ఇళ్లకు వెళ్లి మరీ చర్చలు జరిపిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సీట్ల పంపిణీ విషయం వచ్చే సరికీ ఎటూ తేల్చడం లేదు. పైగా.. మూడు సీట్లు, నాలుగు సీట్లు అంటూ.. లీకులు ఇస్తూ.. అందర్నీ అసహనానికి గురి చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం చాలా సీరియస్ గా ఉన్నారు. ఆయన సీట్ల చర్చల కోసం సిద్ధమైనప్పటికీ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి .. పార్టీ వ్యవహారాల్లో మునిగిపోయారు.

మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు, ఏ ఏ సీట్లు అన్న అంశంపై చర్చలు జరుగుతున్నా…. ఎక్కడా తెగడం లేదు. దీంతో కోదండరాం…మహాకూటమి పెద్దన్న కాంగ్రెస్‌ కు షాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సీట్ల సర్దుబాటుకు 48 గంటల డెడ్ లైన్ విధించారు. 48 గంటల తర్వాత టీజేఎస్ అభ్యర్థుల లిస్టును విడుదల చేస్తామని ప్రకటించారు. తాము కోరినన్ని సీట్లు, కోరిన స్థానాలు ఇవ్వాల్సిందేనని కోదండరామ్‌ పట్టు బడుతున్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కాకపోతే…కలిసొచ్చే శక్తులతో ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ జనసమితి భావిస్తోంది. దీని కోసం కోదండరాం ఇప్పటికే ప్లాన్ బీ అమలు చేస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

టీజేఎస్‌ అధినేత కోదండరాం డెడ్ లైన్ గురించి తెలిసిన వెంటనే… టీటీడీపీ నేత ఎల్ రమణ.. టీజేఎస్ ఆఫీసుకు వెళ్లారు. సీట్ల సర్దుబాటుపై టీజేఎస్‌ 48గంటల డెడ్‌లైన్‌ ఇవ్వడంపై చర్చించారు. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తమ పార్టీ తరపున అందరూ కొత్త వారే పోటీ చేస్తారని.. ఎన్నికల షెడ్యూల్ విడదలైనందున…తమకు కేటాయించే స్థానాలపై క్లారిటీ ఇస్తే బాగుంటుందని.. లేకపోతే.. ఇబ్బంది పడతామని.. కోదండరాం చెప్పినట్లు తెలుస్తోంది. కూటమిలో ఉన్న ఇతర పార్టీలు, టీడీపీ, సీపీఐ సీట్ల విషయమూ ఎటూ తేలలేదు. నవ తెలంగాణ లాంటి చిన్న పార్టీలు కూడా.. సీటు కోసం చూస్తున్నాయి. మరో వైపు.. హైదరాబాద్ శివార్లలో ఓ రిసార్ట్ లో సమావేశమైన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ.. మిత్రపక్షాలన్నింటికీ కలిపి.. 19 సీట్లు ఇవ్వాలని.. అంతకు మించి ఒక్కటి కూడా ఇవ్వకూడదని తీర్మానం చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close