చైతన్య : నగదు బదిలీతో అభివృద్ధి ఎలా సాధ్యం..!?

కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు కనిపిస్తున్నాయి. కేంద్రం నుంచి పన్నుల్లో వాటా తప్పిదే రూపాయి కూడా అదనంగా వచ్చే అవకాశం లేదు. ప్రత్యేకహోదా ఊసు లేదు. అమరావతి ఆలోచన లేదు కానీ… గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీకి మాత్రం… పదేళ్ల పన్ను మినహాయింపు ఇచ్చారు.

కేంద్రం నుంచి సాయం పొందలేకపోయిన ఏపీ సీఎం..!

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా కోసం.. పోరాటం చేశారు. ఆ సమయంలో.. ప్రత్యేకహోదా వస్తే.. ఏపీకి ఎన్నెన్ని ప్రయోజనాలు వస్తాయో… సందర్భం ఉన్నచోటల్లా ఏకరవు పెట్టారు. జీఎస్టీ, ఇన్‌కంట్యాక్స్ సహా.. ఎన్నో పన్ను మినహాయింపులొస్తాయన్నారు. అయితే… కేంద్రం మాత్రం ఆ హోదా ఇచ్చే ప్రశ్నే లేదని.. సూటిగా .. సుత్తి లేకుండా అడిగినప్పుడల్లా చెబుతోంది. అయితే. బడ్జెట్‌లో మాత్రం… పన్ను మినహాయింపులు ప్రకటించారు. కానీ… అది ఏపీకి కాదు.. పునాదులు పడిన అమరావతికి కాదు. గుజరాత్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గిఫ్ట్‌ సిటీకి. లక్షల కోట్ల వ్యయంతో.. వ్యాపార, పారిశ్రామిక, నివాస నగరంగా తీర్చిదిద్దుతున్న గిఫ్ట్ సిటీలో పెట్టుబడులు పెట్టే వారికి పదేళ్లు పాటు.. పన్ను మినహాయింపులు ప్రకటించింది కేంద్రం. దీంతో.. ఏపీ సర్కార్ షాక్ అవ్వాల్సి వచ్చింది

అపరిమితంగా ప్రణాళికేతర వ్యయం..! ఇక అభివృద్ధి ఎలా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతగా.. నవరత్నాల హామీలను అమలు చేయాలని నిర్ణయించుకుంది. వీటికే.. కనీసం 60 వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంది. ఇక ఉద్యోగుల జీతభత్యాలతో పాటు ఇతర హామీలనూ నెరవేర్చాల్సి ఉంటుంది. వీటన్నింటికి ప్రస్తుతం ఏపీ ఆదాయం సరిపోదు. ఇక పోలవరం సహా.. ప్రధాన ప్రాజెక్టులకు… ఏపీ సర్కార్ అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. సంక్షేమం, అభివృద్ధి మధ్య.. సమతూకం లేకపోతే.. రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సంక్షేమ పథకాల ఖర్చు ప్రణాళికేతర వ్యయం కిందకు వస్తుంది. ఇది ఎంత ఎక్కువైతే.. అభివృద్ధి పనులపై అంత ప్రభావం పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే.. ప్రణాళికా వ్యయం కూడా… సంక్షేమానికి కేటాయించినంతగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పుడు అన్ని నిధుల లభ్యత రాష్ట్ర ప్రభుత్వం వద్దు లేదు. అందుకే ప్రణాళికేతర వ్యయాన్ని ప్రణాళికా వ్యయంగా చూపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన.. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ పథకాలకు వెచ్చించే నిధులను.. పెట్టుబడిగా చూడాలంటున్నారు.

ఆదాయాన్ని పెంచుకోకపోతే ఏపీకి గడ్డు పరిస్థితే..!

ఇప్పుడున్న పరిస్థితుల్లో.. రాష్ట్ర ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టాల్సి ఉంది. అలా చేసినప్పుడే.. సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధులు సేకరించుకోగలగుతారు. అప్పులు తీసుకొచ్చి.. సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. సంపద పెరగదు.. అప్పు పెరుగుతుంది. అది గుదిబండగా మారుతుంది. ఈ విషయం ఆర్థిక మంత్రికి తెలియనిది కాదు. ఆదాయాన్ని పెంచుకునేందుకు చేయాల్సిన ప్రణాళికా వ్యయం చేయాలి. లేకపోతే..ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుంది. దివాలా స్థితికి చేరుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిన్న జీయర్ స్వామి చరిత్రను వక్రీకరిస్తున్నారా?

ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులే. అయితే ఈ దాడుల నేపథ్యంలో చిన్న జీయర్ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా ఇవాళ ఆదోనిలో...

‘గ‌ని’గా వ‌రుణ్ తేజ్‌

`ఫిదా`, `తొలి ప్రేమ‌`, `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌` ఇలా వ‌రుస హిట్ల‌తో చెల‌రేగిపోతున్నాడు వ‌రుణ్ తేజ్‌. ఇప్పుడు బాక్స‌ర్ అవ‌తారం ఎత్తుతున్నాడు. కిర‌ణ్ కొర్ర‌పాటి అనే ద‌ర్శ‌కుడితో వ‌రుణ్ ఓ సినిమా...

శంక‌ర్ తెలుగు సినిమా.. అయ్యే ప‌నేనా?

భార‌తీయ ద‌ర్శ‌కుల‌లో శంక‌ర్ ది విభిన్న‌మైన శైలి. రెండు మూడేళ్ల‌కు ఒక సినిమానే తీస్తుంటాడు. అందులో త‌న ప్ర‌త్యేక‌త‌లు ఉండేలా జాగ్ర‌త్త ప‌డ‌తాడు. శంక‌ర్ ఏం చేసినా భారీగానే ఉంటుంది. భారీ...

ఖమ్మం పంచాయతీ తీర్చేందుకు సిద్ధమైన కేటీఆర్..!

ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతోంది. ప్రముఖలనదగ్గ నేతలందరూ టీఆర్ఎస్‌లోనే ఉన్నారు. వారి కోసం ఇతర పార్టీలు వలలేస్తున్నాయి. ప్రాధాన్యం దక్కకపోతే.. ఆ ప్రముఖ నేతలూ పార్టీలో ఉండే అవకాశం లేదు....

HOT NEWS

[X] Close
[X] Close