ఆ జ‌గ‌న్ కు మెద‌డు లేద‌ట‌… ఈ జ‌గ‌న్ కు భ‌యం లేద‌ట‌…

ఇద్ద‌రు జ‌గ‌న్ ల‌పై ఓ ఇద్ద‌రు ప్ర‌ముఖులు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌టి విమ‌ర్శ‌యితే మ‌రోటి ప్ర‌శంస‌. వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ కు మెద‌డు లేద‌ని ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. గ‌తంలో ఈయ‌న జ‌గ‌న్ పంచ‌నే ఉన్నారు. అప్ప‌ట్లో జ‌గ‌న్ ను వేనోళ్ల పొగిడారు. టీడీపీ కండువా వేసుకున్న త‌ర్వాత జ‌గ‌న్ కు మెద‌డు లేద‌నే విష‌యం అర్థ‌మైన‌ట్టుంది.

జ‌గ‌న్ చేప‌ట్టింది భ‌రోసా యాత్ర కాదు బుద‌ర యాత్ర అన్నారు భూమా. ప‌ట్టిసీమ గురించి తెలియ‌క గ‌తంలో విమ‌ర్శించాను. ఇప్పుడు ప‌శ్చాత్తాప‌ప‌డుతున్నాన‌ని చెప్పారు. చంద్ర‌బాబు దూర‌దృష్టిని ఆయ‌న ఎంతో పొగిడారు. జ‌గ‌న్ వ్య‌క్తిత్వంపై నిప్పులు చెరిగారు. అధికార పార్టీలో ఉన్న‌ప్పుడు ఇది మామూలే క‌దా.

సినిమా ద‌ర్శ‌కుడు వీవీ వినాయ‌క్ మ‌రో జ‌గ‌న్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. త‌న‌కు రాజ‌మౌళి అంటేచాలా గౌర‌వ‌మ‌ని చెప్పారు. రాజ‌మౌళి కుటుంబం తామూ క‌లిస్తే అది ఫ్యామిటీ గెట్ టుగెద‌ర్ లా పండ‌గ‌లా ఉంటుంద‌ట‌. అయితే పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌కెంతో స్ఫూర్తి అన్నారు వినాయ‌క్.

కెరీర్ లో ఒడిదుడుకులు వ‌చ్చినప్పుడు జ‌గ‌న్ ను గుర్తు చేసుకుంటార‌ట వినాయ‌క్. ఎంత డౌన్ ఫాల్ ఉన్నా ఏమాత్రం భ‌య‌ప‌డ‌డు. తొణ‌క‌డు బెణ‌క‌డు. అదే పూరీ జ‌గ‌న్ ప్ర‌త్యేక‌త అన్నారు. అంతే కాదు, వచ్చేజ‌న్మ‌లో పుడితే జ‌గ‌న్ లా పుట్టాల‌ని ఉంద‌న్నారు.

ఇంత‌క‌న్నా ప్ర‌శంస ఇంకేముంటుంది. జ‌గ‌న్ ఇంత స్ఫూర్తిదాయ‌క‌మైన వ్య‌క్తి అని ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా మందికి తెలియ‌దు. ఇప్పుడు వినాయ‌క్ ద్వారా అంద‌రికీ తెలిసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేద్దాం అన్న నాగబాబు, కౌంటర్ ఇచ్చిన నెటిజన్లు

భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు 1960వ దశకం నుండి ఉన్నాయి. అప్పుడప్పుడు హిందీ చీనీ భాయి భాయి అంటూ సత్సంబంధాలు నెరపడం, మళ్ళీ అప్పుడప్పుడు చైనా కయ్యానికి కాలు దువ్వడం దశాబ్దాలుగా జరుగుతోంది....

పరిహారం, పర్యావరణానికి ఎల్జీ పాలిమర్స్ కట్టిన రూ.50 కోట్లు ..!

ఎల్జీ పాలిమర్స్ సంస్థ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేసిన యాభై కోట్ల రూపాయలను..పర్యావరణ పునరుద్ధరణ.. బాధితులకు పరిహారం కోసం వినియోగించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్పష్టమైన తీర్పును వెల్లడించింది. కేంద్ర పర్యావరణ...

మరో మూడు నెలలు సీఎస్‌గా సహాని..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి...

ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని... అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి...

HOT NEWS

[X] Close
[X] Close